E-Paper
Advertisement

Premabhishekam Film: ఏఎన్ఆర్ ప్రేమాభిషేకంకి 45 ఏళ్లు.. స్పెషల్ వీడియో పంచుకున్న అన్నపూర్ణ స్టూడియోస్!

Premabhishekam Film: ఏఎన్ఆర్ ప్రేమాభిషేకంకి 45 ఏళ్లు.. స్పెషల్ వీడియో పంచుకున్న అన్నపూర్ణ స్టూడియోస్!
Advertisement

Premabhishekam Film:తెలుగు చిత్ర పరిశ్రమకి మూల స్తంభాల్లాంటి వ్యక్తులలో ఒకరిగా నిలిచిన ఏఎన్ఆర్ (అక్కినేని నాగేశ్వరరావు) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నట సామ్రాట్ గా పేరు దక్కించుకున్న అక్కినేని నాగేశ్వరరావు.. నేడు మన మధ్య లేకపోయినా ఆయన చిత్రాలు మాత్రం ఆయనను సజీవంగా గుర్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన సినీ కెరియర్లో మైలురాయిగా నిలిచిన చిత్రాలలో ‘ప్రేమాభిషేకం’ ఒకటి. కేవలం ఒక సినిమాగా మాత్రమే కాకుండా అప్పట్లో ఒక సంచలనం సృష్టించిన చిత్రం ఇది. ఈ సినిమా విడుదల అయ్యి నేటికీ 45 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ స్పెషల్ వీడియో సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అక్కినేని నాగేశ్వరరావుకి ఘన నివాళి అర్పించింది.

ప్రేమాభిషేకం @45 ఏళ్లు..

ప్రేమాభిషేకం సినిమా విషయానికి వస్తే.. 1981 ఫిబ్రవరి 18న విడుదలైన ఈ సినిమా అప్పట్లో అనేక కేంద్రాలలో సుమారుగా 365 రోజులకు పైగా ప్రదర్శితమై సరికొత్త రికార్డులు సృష్టించింది. ఒక తెలుగు సినిమా ఇన్ని థియేటర్లలో షిఫ్టులు లేకుండా సుమారుగా ఏడాది పాటు ఆడడం అంటే అప్పట్లో ఒక సంచలనం అనే చెప్పాలి. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు తెరకెక్కించిన ఈ సినిమాలో ఏఎన్ఆర్ ఒక క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడిగా, అమర్ ప్రేమికుడిగా , ప్రేక్షకుల గుండెలను పిండేశారు. శ్రీదేవి, జయసుధ నటన ఈ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చింది.

స్పెషల్ వీడియో పంచుకున్న అన్నపూర్ణ స్టూడియోస్..

Advertisement

ముఖ్యంగా ఈ సినిమా ఒక ఎవర్గ్రీన్ అంటే.. ఈ సినిమాలోని పాటలు అంతకుమించి అనే చెప్పాలి.” దేవీ మౌనమా.. శ్రీదేవి మౌనమా.. నీకై తపించి”.., “నా కళ్ళు చెబుతున్నాయి.. నిన్ను ప్రేమించానని.. నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని”.., “వందనం. అభివందనం” వంటి పాటలు తెలుగువారి ఇళ్లల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అలా లక్షలాది మంది హృదయాలలో ఏఎన్ఆర్ ఎప్పటికీ జీవించే ఉంటారు. ప్రేమకు నిర్వచనం.. త్యాగానికి ప్రతీక.. సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ప్రేమాభిషేకం లాంటి చిత్రాలు మళ్లీమళ్లీ రావు అంటూ అన్నపూర్ణ స్టూడియోస్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . ఇది చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఏఎన్ఆర్ పై ప్రశంసలు కురిపిస్తూ ఆయనను గుర్తు చేసుకుంటున్నారు.

also read:Rajinikanth: 12 ఏళ్ల తర్వాత యానిమేషన్ మూవీగా సూపర్ స్టార్ మూవీ.. అప్పుడే రికార్డులు!

ఏఎన్ఆర్ లెగసీని కొనసాగిస్తున్న వారసులు..

Advertisement

ఇకపోతే ఏఎన్ఆర్ లెగసీని ఆయన వారసుడు అక్కినేని నాగార్జున కొనసాగిస్తున్నారని చెప్పాలి. తండ్రికి తగ్గ తనయుడిగా ఒకప్పుడు బ్లాక్ బాస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న నాగార్జున.. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో దూసుకుపోతున్నారు. మరొకవైపు హీరోగా తన 100వ చిత్రంతో వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అలాగే ఈయన వారసులు అక్కినేని అఖిల్, అక్కినేని నాగచైతన్య కూడా తమ సినిమాలతో బిజీ కాబోతున్నారు. ఇక అందులో భాగంగానే నాగచైతన్య వృషకర్మ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకోవాలని ప్రయత్నం చేస్తున్న చైతూ.. ఈ సినిమా షూటింగులో ఉండగానే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏది ఏమైనా అక్కినేని వారసులు ఇప్పుడు తమకంటూ ఒక గుర్తింపు అందుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×