E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదాలు.. నలుగురు మృతి.. గమ్యస్థానానికి చేరకముందే అనంత లోకాలకు!

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదాలు.. నలుగురు మృతి.. గమ్యస్థానానికి చేరకముందే అనంత లోకాలకు!
Advertisement

Road Accident: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం సమీపంలోని టేకుమట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఒక లారీ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే.. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి సమయంలో భీభత్సం జరిగింది. అరుణాచలం పుణ్యక్షేత్ర దర్శనం ముగించుకుని కారులో హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా.. గుర్తు తెలియని వాహనం వీరి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని.. రక్తపు మడుగులో పడి ఉన్న ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Advertisement

సుదూర యాత్ర ముగించుకుని ఇంటికి చేరుకునే తరుణంలో.. గమ్యస్థానానికి కొద్ది దూరంలోనే మృత్యువు కబళించడంతో బాధితుల కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది. పోలీసులు ఈ హిట్ అండ్ రన్ కేసుగా భావిస్తూ.. కారును ఢీకొట్టి పరారైన వాహనాన్ని గుర్తించేందుకు టోల్ ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

నిరంతరం ప్రమాదాలకు నిలయంగా మారుతున్న రహదారులపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×