Jailer 2 Update :రజినీకాంత్ (Rajinikanth) ఈ ఏజ్ లో కూడా వందల కోట్ల బడ్జెట్ ఉండే సినిమాలు చేస్తున్నారంటే ఆయన డెడికేషన్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక రజినీకాంత్ నటించిన రీసెంట్ మూవీ ‘వెట్టయాన్’ (Vettaiyan) యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఆయన నటిస్తున్న తాజా మూవీ కూలీ(Coolie) పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఇందులో ఎంతోమంది స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలా రజినీకాంత్ కి విలన్ గా కూలీ మూవీలో నాగార్జున(Nagarjuna) నటించడం ఒక ఎత్తు అయితే ఇందులో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan), కన్నడ నటుడు ఉపేంద్ర (Upendra), శృతిహాసన్(Shruti Haasan) వంటి సెలబ్రిటీలు కీలకపాత్రల్లో చేయడం మరో ఎత్తు. అలా భారీ తారాగణంతో ఆగస్టు 14న విడుదల కాబోతున్న కూలీ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.
జైలర్ 2 లో షారుక్ ఖాన్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..
అయితే ఈ సినిమా తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) డైరెక్షన్లో రజినీకాంత్ జైలర్ (Jailer) మూవీకి సీక్వెల్ గా వస్తున్న జైలర్ -2లో నటించబోతున్నారు.ఈ సినిమా గురించి ప్రస్తుతం కోలీవుడ్లో ఒక క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. అదేంటంటే జైలర్-2 (Jailer-2) మూవీలో రజినీకాంత్ కి విలన్ గా బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్(Shahrukh Khan) నటిస్తున్నట్టు.. ఇప్పటికే కూలీ మూవీలో నాగార్జునని విలన్ గా, అతిథి పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ని తీసుకున్నారు.
అయితే జైలర్-2 మూవీలో అంతకుమించి ఉండేలా అంచనాలు ఉండాలని రజినీకాంత్ కి విలన్ గా షారుఖ్ ఖాన్ ని ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజా వార్తలపై బాలీవుడ్ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. జైలర్ -2 లో షారుక్ ఖాన్ విలన్ గా చేస్తున్నట్టు వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని,ఇలాంటి వార్తలు క్రియేట్ చేసే వారికి కాస్తయినా హద్దు అదుపు ఉండాలని, ఏదైనా రూమర్ క్రియేట్ చేసేటప్పుడు కొంచమైనా మైండ్ పెట్టి ఆలోచించాలని,ఏది పడితే అది క్రియేట్ చేయకూడదు అంటూ షారుఖ్ ఖాన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.
జైలర్ 2 మూవీ అప్డేట్స్..
అంతేకాదు రజినీకాంత్ మూవీలో షారుఖ్ ఖాన్ విలన్ గా చేస్తున్నట్టు వచ్చిన వార్తలను కొట్టి పారేస్తున్నారు. దీంతో రజినీకాంత్ – షారుక్ ఖాన్ కాంబోలో జైలర్ -2 రాబోతుంది అనే వార్తలకు తెర పడినట్లు అయింది. ఇక రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilip Kumar) కాంబోలో 2023లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన జైలర్ మూవీ సైలెంట్ గా రూ.650 కోట్ల కలెక్షన్లను సాధించి రజినీకాంత్ కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచింది.
ఇక ఈ సినిమా హిట్ అవ్వడంతో దీనికి సీక్వెల్ గా జైలర్-2 ని అనౌన్స్ చేశారు. ఈ మూవీలో అందరూ మలయాళ మూవీ ఆర్టిస్ట్ లే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక తాజాగా కోలీవుడ్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. జైలర్ -2 లో పవర్ ఫుల్ విలన్ పాత్రలో ఎస్.జె.సూర్య (S.J. Surya) నటిస్తున్నారట.
also read:Upasana: ఎట్టకేలకు క్లీంకారాను చూపించేసిన ఉపాసన.. ఎంత క్యూట్ గా ఉందో!