BigTV English
Advertisement

Upasana: ఎట్టకేలకు క్లీంకారాను చూపించేసిన ఉపాసన.. ఎంత క్యూట్ గా ఉందో!

Upasana: ఎట్టకేలకు క్లీంకారాను చూపించేసిన ఉపాసన.. ఎంత క్యూట్ గా ఉందో!

Upasana: ఉపాసన (Upasana)-రామ్ చరణ్ (Ram Charan) గారాలపట్టి క్లీంకారా (Klinkaara )కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా క్లీంకారా ముఖాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే తనను నాన్న అని పిలిచిన రోజే తన ముఖాన్ని చూపిస్తాను అని బాలయ్య(Balakrishna ) అన్ స్టాపబుల్ షోలో రామ్ చరణ్ (Ram Charan) చెప్పిన విషయం తెలిసిందే. దీంతో క్లీంకారా తన తండ్రిని ఎప్పుడు నాన్న అని పిలుస్తుందో ..? ఎప్పుడు ఆ పాప ముఖం మనం చూస్తామో ? అని అభిమానులు కూడా ఎదురు చూశారు.


ఎట్టకేలకు క్లీంకారాను చూపించేసిన ఉపాసన..

అయితే ఇవాళ క్లీంకారా రెండవ పుట్టినరోజు కావడంతో.. ఎట్టకేలకు ఉపాసన క్లీంకారాను చూపించేసింది. జూలో వైట్ టైగర్ తో దిగిన ఫోటోను ఉపాసన షేర్ చేసింది. హైదరాబాదులోని జూలో ఉండే పులిపిల్లను దత్తత తీసుకొని, దానికి కూడా క్లీంకారా అని పేరు పెట్టినట్లు వీరు చెప్పిన విషయం తెలిసిందే. వన్యప్రాణుల సంరక్షణకు తాము మద్దతు ఇస్తామని కూడా తెలిపారు. ఇక ఇందులో తల్లి ఒడిలో కూర్చుని.. ఈ క్లీంకారా .. ఆ క్లీంకారాను చూస్తూ దిగిన ఫోటో ఇప్పుడు చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలో క్లీంకారాను చూసి ఎంత క్యూట్ గా ఉందో అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.


ఎట్టకేలకు క్లీంకారాను చూపించేసిన ఉపాసన..

అయితే ఇవాళ క్లీంకారా రెండవ పుట్టినరోజు కావడంతో.. ఎట్టకేలకు ఉపాసన క్లీంకారాను చూపించేసింది. జూలో వైట్ టైగర్ తో దిగిన ఫోటోను ఉపాసన షేర్ చేసింది. హైదరాబాదులోని జూలో ఉండే పులిపిల్లలను దత్తత తీసుకొని, దానికి కూడా క్లీంకారా అని పేరు పెట్టినట్లు తాజాగా ఉపాసన తెలియజేసింది. వన్యప్రాణుల సంరక్షణకు తాము మద్దతు ఇస్తామని కూడా తెలిపింది. ఇక ఇందులో తల్లి ఒడిలో కూర్చుని.. ఈ క్లీంకారా .. ఆ క్లీంకారాను చూస్తూ దిగిన ఫోటో ఇప్పుడు చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలో క్లీంకారాను చూసి ఎంత క్యూట్ గా ఉందో అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

పులిపిల్లను దత్తత తీసుకున్న ఉపాసన..

అసలు విషయంలోకి వెళ్తే.. అపోలో హాస్పిటల్ సీ.ఎస్.ఆర్ వైస్ చైర్మన్, యువర్ లైఫ్ సంస్థ వ్యవస్థాపకురాలు, సినీ నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురువారం నెహ్రూ జూపార్కులోని పులి పిల్లలను దత్తత తీసుకున్నారు. తన కుమార్తె క్లీంకారాతో కలిసి జూకి వెళ్లిన ఆమె అక్కడ వివిధ జంతువుల ఎన్క్లోజర్లను కూడా వీక్షించారు. ఆ తర్వాత జూపార్క్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ హిరేమత్ ను సంప్రదించి పులి పిల్లలను ఆమె దత్తత తీసుకోవడం జరిగింది. అంతేకాదు వాటి పోషణకు అవసరమైన డబ్బులను చెక్కు రూపంలో డైరెక్టర్ కు అందజేసింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మెగా ఫ్యామిలీ గారాలపట్టి..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకొని.. ఇప్పుడు ఒక్క సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన రామ్ చరణ్ .. 2012 జూన్ 14న అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాపరెడ్డి మనవరాలు ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే వివాహం జరిగిన 11 ఏళ్ల తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఉపాసన. 2023 జూన్ 20వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక పాప రాకతో అటు ఉపాసన, ఇటు రాంచరణ్ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈ చిన్నారి పుట్టడంతో మెగా ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. అంతేకాదు మెగా ఇంటికి అదృష్టం చిన్నారి రూపంలో వచ్చింది . ఆమె ఇంటికి వచ్చిన వేళా విశేషం ఏమో కానీ ఆ ఏడాది మొత్తం మెగా ఫ్యామిలీలో అన్ని మంచి శుభములే జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి పద్మ విభూషణ్ రావడం, పదేళ్ల పోరాటం తర్వాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి ఏపీకి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించడం, రామ్ చరణ్ కి గౌరవ డాక్టరేట్ లభించడం అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. మొత్తానికైతే మెగా ఫ్యామిలీకి ఈ పాప అదృష్టవంతురాలు అనడంలో సందేహం లేదు.

also read:Kuberaa Public Talk : కుబేర పబ్లిక్ టాక్.. ధనుష్ ఒకే.. నాగార్జునకే మైనస్

 

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×