Renuka Shahane: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్(Casting Couch) ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఎంతోమంది సెలబ్రిటీలు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. అయితే పలు సందర్భాలలో సెలబ్రిటీలు ఇండస్ట్రీలో వారు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బహిరంగంగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అయితే తాజాగా బాలీవుడ్ నటి రేణుక షహానేకు(Renuka Shahane) కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందని తాజాగా ఈమె ఓ సందర్భంలో వెల్లడించారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ ఒక నిర్మాత తన ఇంటికి వచ్చి తనకు వివాహం అయిందని తెలిపారు. ఇక ఆ నిర్మాత చీరల వ్యాపారం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆయన చీరలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని నన్ను కోరారు.
ఇలా చీరలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని కోరడమే కాకుండా, ఆయనతో కలిసి ఉంటే ప్రతినెల స్టైఫెండ్ ఇస్తానని నిర్మాత చెప్పడంతో ఒక్కసారిగా నేను నా తల్లి ఆశ్చర్యపోయామని తెలిపారు. ఇలా ఆ నిర్మాత ఇచ్చిన ఆఫర్ తాను తిరస్కరించానని పేర్కొన్నారు. అయితే మనం వారికి ఎదురు చెబితే ఇండస్ట్రీలో మనకు అవకాశాలు రాకుండా చేస్తారని, నా విషయంలో ఇలా జరగలేదు కానీ ఇలాంటి విషయాలలో జాగ్రత్త వహించాలని కోరారు. ఇండస్ట్రీలో ఇలాంటి చర్యలకు పాల్పడే వారి పట్ల అప్పట్లో చర్యలు తీసుకునేవారు కానీ ఇటీవల కాలంలో మీటూ ఉద్యమం పెద్దగా పట్టించుకోవట్లేదని ఇలా తప్పులు చేసిన వారు తిరిగి ఇండస్ట్రీలో కొనసాగడానికి మార్గం సులభం అవుతోందని పేర్కొన్నారు.
ఇలా ఇండస్ట్రీలో ఈ విధమైనటువంటి ఇబ్బందులు తాను ఒక్కటే కాదు రవీనా టాండన్ (Ravina Tandon)వంటి ప్రముఖ నటీమణులు కూడా ఇలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవారని పేర్కొన్నారు. రవీనా ఒక గొప్ప నటి.. అయితే ఆమె తనని తాను రక్షించుకోవడం కోసం అవుట్డోర్ షూటింగ్ వెళ్ళినప్పుడు మేము హోటల్లో ఏ గదిలో ఉంటున్నామో ఎవరికి తెలియకుండా చాలా రహస్యంగా ఉండే వాళ్ళమని వెల్లడించారు.అంతే కాకుండా ప్రతిరోజు హోటల్లో రూమ్ మారుతూ ఉండటం వల్ల మమ్మల్ని ఇబ్బంది పెట్టలేకపోయేవారని పేర్కొన్నారు.
అర్ధరాత్రి తలుపులు కొడతారు..
పలువురు దర్శక నిర్మాతలు అవుట్ డోర్ షూటింగ్ సమయంలో అర్ధరాత్రి సమయంలో హీరోయిన్ గదికి వెళ్లి తలుపు కొట్టడం వారిని ఇబ్బందులకు గురి చేయడం వంటి చర్యలకు పాల్పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ హీరోయిన్ లు ప్రతిరోజు రూమ్స్ మారేవారని ఈమె పేర్కొన్నారు. ఇలా ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి నటి రేణుక చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ నిర్మాత ఎవరు? ఏంటి అనే వివరాలను మాత్రం రేణుక ఎక్కడ బయట పెట్టలేదు.
Also Read: Abhisekh Bachchan: అభిషేక్ బచ్చన్ మేకప్ ఆర్టిస్ట్ మృతి..నీ కాళ్లు మొక్కాకే అంటూ ఎమోషనల్!