The Great Pre wedding show: కొన్ని సినిమాలకు విపరీతమైన పాజిటివ్ టాక్ వస్తుంది. కానీ ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన కమర్షియల్ సక్సెస్ అందుకోవు. ఈరోజుల్లో గొప్ప సినిమా రావడం గగనం అయిపోయింది. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తారు అని ఎప్పటినుంచో చెబుతూ వస్తుంటారు. కొన్ని సినిమాలు వరకు ఇది నిజంగానే జరిగింది. కానీ ఇలా చెప్పడం మాత్రమే ఇంకొన్ని సినిమాలకు మిగిలిపోయింది. తిరువీర్ హీరోగా నటించిన సినిమా ది ఫ్రీ వెడ్డింగ్ షో.
ఈ షో ప్రీమియర్స్ పడినప్పటి నుంచి విపరీతమైన పాజిటివ్ టాక్ వస్తుంది. చాలామంది ఈ సినిమాకు 3 పైగా రేటింగ్ ఇచ్చారు. 3 ఇచ్చారు అంటే అది మామూలు విషయం కాదు చాలా పెద్ద సినిమాలకే ఈ రేంజ్ లో రేటింగ్ ఇవ్వరు. అయితే ఈ సినిమాకి భారీ స్థాయిలో రేటింగ్ వచ్చినా కానీ జనాలు థియేటర్ కు వచ్చి చూసే పరిస్థితి లేకుండా పోయింది. కానీ ఓటీడీలో చూసిన తర్వాత ఈ సినిమాకి విపరీతమైన ఆదరణ లభిస్తుంది అని చెప్పాలి.
ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది కాబట్టి, చాలామంది సెలబ్రిటీలు కూడా చూసి ఈ సినిమా గురించి ట్వీట్ చేశారు. అయితే ప్రత్యేకంగా ఎవరూ ముందుకు వచ్చి ఈ సినిమా గురించి మాట్లాడటం లేదు. గతంలో వెంకటేష్ మహా దర్శకుడుగా పరిచయమైన కేరాఫ్ కంచరపాలెం సినిమా అప్పుడు చాలామంది పెద్దపెద్ద దర్శకులు కూడా ముందుకు వచ్చి ఆ సినిమా గురించి మాట్లాడారు. అందుకే అది చిన్న సినిమా అయినా కూడా మంచి సక్సెస్ సాధించింది.
కంచరపాలెం సినిమా అప్పుడు చాలామంది సెలబ్రిటీలు మాట్లాడారంటే దానికి కారణం ఆ సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేసింది సురేష్ ప్రొడక్షన్స్. రానా ఉండటం వల్లనే ఆ సినిమాని అంతలా ప్రమోట్ చేశారు అని చాలామంది తర్వాత కాలంలో కామెంట్ చేశారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది కూడా నిజమే అనిపిస్తుంది.
చిత్ర యూనిట్ మాత్రం నిరశపడకుండా ఈ సినిమాను ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి ఒకసారి పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత ఈవినింగ్ కి ఆ సినిమా పికప్ అందుకోవాలి. కానీ ప్రీ వెడ్డింగ్ షో సినిమా విషయంలో అదేమీ జరగడం లేదు. ఈ సినిమా కొన్ని రోజులు తర్వాత ఓటీడీలో దర్శనమిస్తే, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫీల్డ్ హియర్ అని పోస్టులు పడే అవకాశం కూడా ఉంది.
Also Read: Priyanka Chopra : నాకు హైదరాబాద్‌లో పనేంటి… బిగ్ సీక్రెట్ రివీల్ అంటున్న ప్రియాంక చోప్రా