Kalyan Ram:ఇండస్ట్రీలో నందమూరి అన్నదమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో బాలకృష్ణ తర్వాత అంతగా ఎదిగింది జూనియర్ ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ తరువాత కళ్యాణ్ రామ్ ఇప్పటికీ ఆ స్థానానికి అవడానికి కష్టపడుతున్నాడు. ఎక్కడైనా అన్న తర్వాత తమ్ముడు ఇండస్ట్రీకి పరిచయం అవుతాడు. కానీ ఇక్కడ మాత్రం ముందు తమ్ముడు పరిచయం అయ్యాకే అన్న కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
బాబాయ్ బాలకృష్ణ లాగా తమ్ముడు ఎన్టీఆర్ లాగా కళ్యాణ్ రామ్ సైతం ఒక మంచి స్టార్ హీరో అవుతాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఒక చేతికి ఉన్న వేళ్ళు ఒకేలా ఎలా ఉండవో ఈ ఇద్దరు అన్నదమ్ముల కెరిర్స్ కూడా ఒకేలా సాగలేదు. ఎన్టీఆర్ వరుస విజయాలతో పాన్ ఇండియా స్టార్ గా మారగా కళ్యాణ్ రామ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయపజయాలను పట్టించుకోకుండా ఇంకా స్ట్రగుల్స్ లోనే కొనసాగుతున్నాడు.
హరికృష్ణ మరణించే వరకు కూడా ఈ ఇద్దరు అన్నదమ్ములు అంతగా బయట కనిపించలేదు. కానీ, ఎప్పుడైతే తండ్రి మరణించాడో అప్పటినుంచి తమ్ముడు ఎన్టీఆర్ నే కళ్యాణ్ రామ్ తండ్రిగా భావిస్తున్నాడు. ప్రతి విషయంలోనూ తమ్ముడి సలహా తీసుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ రీఎంట్రీ మొదలైంది అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత ఈ హీరో కొద్దికొద్దిగా సెట్ అవుతాడు అనుకున్నారు. కానీ, ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు భారీ పరాజయాన్ని అందుకున్నాయి.
ఇంకోపక్క కళ్యాణ్ రామ్ నిర్మాతగా కూడా తన సత్తా చాటడానికి విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. దేవర సినిమాతో నిర్మాతగా కళ్యాణ్ రామ్ ఒక మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో మంచి కథని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ బాడీ పెంచుతున్నాడు. తాజాగా జిమ్ లో కసరత్తులు చేస్తున్న ఫోటోను అతను అభిమానులతో పంచుకున్నాడు. కండలు తిరిగిన దేహంతో రఫ్ లుక్ లో కళ్యాణ్ లుక్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు.
కళ్యాణ్ రామ్ లుక్ చూసి అభిమానులు ఎన్టీఆర్ లుక్ పై మరోసారి ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది కాలంగా ఎన్టీఆర్ లుక్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. పూర్తిగా బరువు తగ్గి ముఖంలో కళ అనేది కూడా లేకుండా ఎన్టీఆర్ లుక్ మరి దారుణంగా మారిపోయింది. ఎన్టీఆర్ కి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అని అభిమానులు అనుమాన పడుతున్నారు. ఇక ఈ ఏడాది లుక్కు విషయంలో తమ్ముడు కన్నా అన్న హైలైట్ అయ్యేలా ఉన్నాడు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ తన మునుపటి రూపానికి మళ్లీ తిరిగి వస్తాడో లేదో చూడాలి.