BigTV English

Naga Vamsi: ఓజీ సినిమాలో కళ్యాణ్ అసలేం చేశారు ? నిర్మాత నాగవంశీ షాకింగ్ కామెంట్

Naga Vamsi: ఓజీ సినిమాలో కళ్యాణ్ అసలేం చేశారు ? నిర్మాత నాగవంశీ షాకింగ్ కామెంట్
Advertisement

Naga Vamsi: కొంతమంది నిర్మాతలు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాలు చూడడం మొదలు పెడుతుంటారు. అలా చూడడం మొదలుపెట్టినప్పుడే ఎక్కువ శాతం సక్సెస్ వస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాను చూడగలిగిన అతి తక్కువ మంది నిర్మాతలలో నాగవంశీ కూడా ఒకరు.


చిన్న సీన్ కి కూడా ఎక్కువగా ఎక్సైజ్మెంట్ అవ్వటం అనేది నాగవంశీకి అలవాటుగా మారిపోయింది. తనకి వచ్చిన ఎక్సైట్మెంట్ ఆడియన్ కి రాకపోతే ఆ సినిమా నిరాశ ను మిగులుస్తుంది. అదే ఎక్సైట్మెంట్ ఆడియన్స్ కి కూడా వస్తే సినిమా ఫలితం ఇంకొకలా ఉంటుంది.

కొన్ని సినిమాలు మినహాయిస్తే నాగ వంశీ నిర్మించిన సినిమాలకు మంచి సక్సెస్ రేట్ ఉంది అనేది వాస్తవం. తాను డిస్ట్రిబ్యూట్ చేసిన వార్ వంటి సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు. కానీ సితార ఎంటర్టైన్మెంట్స్ లో కొన్ని సినిమాలు మాత్రమే ఊహించిన రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయాయి.


ఓజి ఇంటర్వెల్ బ్లాక్ పై నాగ వంశీ రియాక్షన్ 

సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఓ జి. విపరీతమైన అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి కొంతమేరకు అంచనాలను నిలబెట్టుకుంది. చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులను ఈ సినిమా సంతృప్తి పరిచింది. ఈ సినిమా ఇంటర్వెల్ బ్లాక్ బాగా వర్కౌట్ అయింది. దీని గురించి నాకు వంశీ మాట్లాడారు.

ఓజి సినిమా మొన్న విడుదలైంది. ఇంటర్వెల్ బ్లాకు చూసి అందరూ ఊగిపోతున్నారు. ఇంటర్వెల్ బ్లాకులో కళ్యాణ్ గారు ఏం చేశారు తల నరికారు. అది కమర్షియల్ రెగ్యులర్ మాస్ మూమెంట్. గత 20 ఏళ్ల నుంచి చూస్తే సినిమాల్లో చాలాసార్లు అది వచ్చింది.

అతనొక్కడే సినిమా దగ్గర నుంచి మొదలుపెడితే మొన్న బాలకృష్ణ గారి డాకు మహారాజు వరకు అదే. కానీ ఎందుకు హై వచ్చింది అంటే అది ఒక కమర్షియల్ మూమెంట్ కాబట్టి. ఆ కమర్షియల్ మూమెంట్ వర్కౌట్ అయితే సినిమా వర్కౌట్ అవుతుంది.

కొందరు హీరోలు కొన్ని చేయాలి 

ప్రస్తుతం నాగ వంశీ రవితేజ హీరోగా మాస్ జాతర అనే సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకులు ముందుకు రానుంది. సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా కొంతమంది స్టార్ హీరోలు కొన్ని విషయాలు చేస్తే అవి బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ అవుతాయి. అలాంటి ప్రయత్నమే దర్శకుడు భాను మాస్ జాతర సినిమాతో చేశాడు. ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో తెలియదు కానీ ఈ సినిమా సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అని నాగ వంశి చెప్పాడు.

గతంలో నాగ వంశీ ఇలాంటి కామెంట్స్ చేయడం వలనే సినిమాలు మీద కొంత మేరకు ఎఫెక్ట్ పడింది అనేది వాస్తవం. అందుకే ఈ స్టేట్మెంట్ ఇవ్వడంతోనే జనాలు ఎలా తీసుకుంటారో తెలియదు అని చెప్పాడు.

Also Read: Dhruv Vikram : మొదటి స్పీచ్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా, ఎంత స్పష్టంగా మాట్లాడాడో

Related News

Disha Patani: మేడమ్.. మీరు సారా.. ఆ హగ్స్ ఏంటి.. ఈ పూజలు ఏంటి

Rc 17: ఆ డిజాస్టర్ హీరోయిన్ కు సుక్కు మరో అవకాశం

Mass Jathara: మాస్ జాతర వాయిదా.. ఆ సినిమానే కారణమా.. కావాలనే చేశారా?

Megastar Chiranjeevi: మన శంకర్ వరప్రసాద్ గారు సెట్ లో విక్టరీ వెంకటేష్, రేపు అఫీషియల్ వీడియో

Kalyan Ram: ఈసారి తమ్ముడు కన్నా అన్న హైలైట్ అయ్యేలా ఉన్నాడే..

Dhruv Vikram : మొదటి స్పీచ్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా, ఎంత స్పష్టంగా మాట్లాడాడో 

Nagavamshi: ఆ బడా ప్రొడ్యూసర్ ను నమ్మి తప్పు చేశాం.. రియాలిటీలోకి వచ్చిన నాగ వంశీ!

Big Stories

×