BigTV English

Anushka Sharma: న‌టాషా, ధ‌న శ్రీ ఛీటింగ్‌..మ‌రి అనుష్క మాత్రం అలాంటి ప‌నులు..?

Anushka Sharma: న‌టాషా, ధ‌న శ్రీ ఛీటింగ్‌..మ‌రి అనుష్క మాత్రం అలాంటి ప‌నులు..?
Advertisement

Anushka Sharma:  టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. విరాట్ కోహ్లీ కఠినమైన పరిస్థితులలో ఉన్న సమయంలో కూడా అనుష్క శర్మ అతడిని విడిచిపెట్టలేదు. నేటి కాలంలో క్రికెటర్లు అందరూ చిన్న చిన్న విషయాలకు విడాకుల బాట పడుతున్నారు. హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. హార్దిక్ పాండ్యా మంచి ఫామ్ లో ఉండి భారీగా డబ్బులు సంపాదించినప్పటికీ నటాషా విడాకులు తీసుకున్నారు. అదేవిధంగా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా తన మాజీ భార్య ధనశ్రీ వర్మకు విడాకులు ఇచ్చారు. చిన్నచిన్న విషయాలకి విడాకులు తీసుకుంటున్న ఈ కాలంలో అనుష్క శర్మ మాత్రం విరాట్ కోహ్లీ ఎంత కఠినమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ అతడి చేతిని విడిచిపెట్టలేదు.


Also Read: IND VS PAK: 95, 195, 295 పరుగుల వద్ద సిక్స‌ర్ కొట్టిన ఏకైక మొన‌గాడు..పాకిస్థాన్ కు వెన్నులో వ‌ణుకు పుట్టించాడు

అనుష్క శర్మ కోహ్లీ పరిచయం

విరాట్ కోహ్లీ అనుష్క శర్మ మొదటిసారిగా యాడ్ షూట్ సమయంలో ఒకరికొకరు కలుసుకున్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త అతి తక్కువ సమయంలోనే ప్రేమగా మారింది. దీంతో చాలా కాలం పాటు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.


2014లో కోహ్లీ చెత్త ఫామ్

2014 సంవత్సరంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెత్త ఫామ్ కనబరిచాడు. అతడు ఎన్నో కఠినమైన పరిస్థితిలను ఎదుర్కొన్నాడు. కెప్టెన్సీని కూడా కోల్పోయాడు అయినప్పటికి అనుష్క శర్మ కోహ్లీని సపోర్ట్ చేస్తూనే వచ్చింది. స్టేడియంలో కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అనుష్క శర్మ ఎంతగానో సపోర్ట్ గా నిలుస్తూ ఉంటుంది. అతడికి ఫ్లయింగ్ కిస్ లు ఇస్తూ క్లాప్స్ కొడుతూ చాలా సపోర్ట్ గా ఉంటుంది. దీంతో కోహ్లీ తన సపోర్ట్ తో చెలరేగి తన ఆటతీరుని కొనసాగిస్తుంటాడు. ఆ తర్వాత కోహ్లీ తనదైన ఆట తీరుతో టీమ్ ఇండియాకు ఎన్నో విజయాలను అందించాడు. ప్రస్తుతం కోహ్లీ టెస్టులు, టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కేవలం వన్డేలు, ఐపీఎల్ మ్యాచ్లు మాత్రమే ఆడుతున్నాడు.

కోహ్లీ కోసం తన కెరీర్ త్యాగం చేసిన అనుష్క శర్మ

కోహ్లీతో వివాహం జరిగిన అనంతరం అనుష్క శర్మ ఎప్పటిలానే తన సినీ కెరీర్ కొనసాగించింది. ఆ తర్వాత ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తిరిగి తన సినిమాలలో తాను నటిస్తూ ఉంది. కొన్ని రోజులపాటు ఎప్పటిలానే సినిమాలలో నటించిన అనుష్క శర్మ మరోసారి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తాను సినిమాలకు పూర్తిగా దూరమైంది. తన పూర్తి సమయాన్ని తన భర్త పిల్లలకు మాత్రమే కేటాయిస్తోంది. ప్రస్తుతం అనుష్క శర్మ సినిమాలకు వీడ్కోలు చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. కేవలం యాడ్ షూట్స్ లలో మాత్రమే అనుష్క శర్మ పాల్గొంటుంది. సోషల్ మీడియాలో అనుష్క శర్మకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. తాను పోస్ట్ చేసే ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతాయి. అనుష్క శర్మ విరాట్ కోహ్లీ వారి కుటుంబ సభ్యులతో కలిసి లండన్ లో సెటిల్ అయ్యారు. సంతోషంగా వారి లైఫ్ కొనసాగిస్తున్నారు.

Also Read: Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండ‌టం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే ప‌నులు ?

 

 

Related News

BAN vs WI: వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి..50 ఓవ‌ర్లు స్పిన్న‌ర్లే బౌలింగ్…సూప‌ర్ ఓవ‌ర్ లో ట్విస్ట్‌

Jasprit Bumrah Grandfather: ఇంటి నుంచి గెంటేసిన ఫ్యామిలీ..బుమ్రా తాత‌య్య ఆత్మ‌హ‌*త్య‌ ?

Mohammad Rizwan: రిజ్వాన్ కెప్టెన్సీ తొల‌గించ‌డం వెనుక పాల‌స్తీనా కుట్ర‌లు..!

Mohsin Naqvi: సూర్యకు కుద‌ర‌క‌పోతే, నా ఆఫీసుకు అర్ష‌దీప్ ను పంపించండి..ఆసియా క‌ప్ ఇచ్చేస్తా

Team India -Divorce: విడాకులు తీసుకున్న మ‌రో టీమిండియా ప్లేయ‌ర్‌…భార్య లేకుండానే దీపావ‌ళి వేడుకలు

Rishabh Pant : బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం..కెప్టెన్ గా రిషబ్ పంత్…సర్ఫరాజ్ ఖాన్ కు నిరాశే

Team India: 6 బంతుల్లో 6 సిక్స‌ర్లు…20 బంతుల్లోనే సెంచ‌రీ, టీమిండియా ప్లేయ‌ర్ అరాచ‌కం..బౌల‌ర్ల‌కు న‌ర‌కం చూపించాడు!

Big Stories

×