Dhruv Vikram : తెలుగు సినిమా ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా వ్యక్తులను సినిమాలను ప్రేమించడం అలవాటు చేసుకున్నారు. అందుకే చాలామంది తమిళ్ హీరోలకు ఇక్కడ అద్భుతమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. సూర్య, రజనీకాంత్, విక్రమ్, కార్తీ, సిద్ధార్థ్ వంటి ఎందరో తమిళ హీరోలు సినిమాలకు ఇక్కడ విపరీతమైన ఆదరణ లభిస్తుంది.
కేవలం వాళ్లకు మాత్రమే కాకుండా శివ కార్తికేయన్, ధనుష్, విజయ్ సేతుపతి వంటి హీరోల సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు ప్రస్తుతం విపరీతంగా చూస్తారు. కేవలం తమిళనాడు మాత్రమే కాదు మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలను కూడా విపరీతంగా ఆదరిస్తారు.
ఎన్నో అద్భుతమైన సినిమాలు విక్రమ్ వి తెలుగులో విడుదలయ్యాయి. అందులో అపరిచితుడు సినిమా గురించి ఎవరు మర్చిపోలేరు. విక్రమ్ కి కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఒక ప్రముఖ హీరో తనయుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటే అతని మీద కూడా కొద్దిపాటి అంచనాలు ఉంటాయి.
అర్జున్ రెడ్డి రీమేక్ ద్వారా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ధ్రువ విక్రమ్. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తరువాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో మహాన్ అనే ఒక సినిమాను చేశాడు ధ్రువ విక్రమ్.
ఇక ప్రస్తుతం మారి సెల్వరాజ్ దర్శకత్వంలో బైసన్ అనే సినిమాను చేశాడు. ఈ సినిమా అక్టోబర్ 17న ఆల్రెడీ విడుదల అయిపోయింది. ఈ సినిమాకి సంబంధించిన తెలుగు వెర్షన్ అక్టోబర్ 24న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో హైదరాబాదులో ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే తెలుగులో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచాడు ధ్రువ విక్రమ్.
తాను తెలుగు మీడియాతో మాట్లాడాలనుకున్నది నీటుగా పేపర్ మీద రాసుకుని వచ్చి ప్రాపర్ గా చదివాడు. తను ఒక షాపింగ్ చేస్తున్నప్పుడు మీరు విక్రంలా ఉన్నారు అని హైదరాబాదులో ఒకరన్నారట. నేను వాళ్ళ అబ్బాయిని అని చెప్పారట ధ్రువ విక్రమ్. మీ నాన్నగారికి పెద్ద అభిమానులం అని వాళ్ళు చెప్పారట.
అలానే రేపు నా కొడుకు ఏదైనా షాపింగ్ మాల్ కి వెళ్తే మీ తండ్రి ధ్రువ విక్రమ్ కి మేము చాలా పెద్ద అభిమానులం అని చెప్పించుకునేలా కష్టపడతాను. అంటూ తెలుగులో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచాడు ధ్రువ విక్రమ్.
Also Read: Venkatesh Trivikram : వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి, అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు