Anupama Parameswaran : కొంతమంది చాలా బలంగా నమ్మి కొన్ని సినిమాలను చేస్తుంటారు. అయితే ఆ సినిమాలు అన్నివేళలా మంచి ఫలితాన్ని ఇస్తాయి అని ఊహించలేము. చాలామంది దర్శక నిర్మాతలు కొన్ని సినిమాలు మీద విపరీతమైన ప్రేమను పెంచుకుంటారు. కానీ ప్రేక్షకులు నిర్ణయం కొన్నిసార్లు వాళ్లకు బాధను కలిగించవచ్చు.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. తెలుగులో ఆ ఆ సినిమాతో మంచి గుర్తింపు సాధించుకుంది అనుపమ. ఆ తర్వాత వరుసగా హీరోయిన్ గా సినిమాలు చేయడం మొదలుపెట్టింది. శతమానం భవతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. ఆ సినిమాలో నిత్య అనే పాత్ర విపరీతమైన గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
సినిమా బండి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు ప్రవీణ్ కాండ్రేగుల. ఆ సినిమా నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది. ఆ సినిమాకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడుగా చేసిన శుభం సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. అయితే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు అంతగా ఆదరణ లభించుదు. కానీ ఓటీటీ లో చూసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు.
ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా సినిమాకి కూడా అటువంటి ఫలితమే ఎదురయింది. ఇక ప్రస్తుతం బైసన్ సినిమాలో అనుపమ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 24న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికరమైన విషయాలను రివిల్ చేసింది.
పరదా సినిమా నన్ను బాగా డిసప్పాయింట్ చేసింది. నేను ఆ సినిమాను విపరీతంగా నమ్మి చేశాను. ఆ సినిమా నన్ను డిసప్పాయింట్ చేసింది అనే విషయం ఒప్పుకోవాలి. ఇక కిష్కిందపురి సినిమా డీసెంట్ సక్సెస్ సాధించి మంచి పేరు సాధించింది. ఇప్పుడు బైసన్ సినిమా కూడా సక్సెస్ అయితే అనుపమ కెరియర్ కి మరి కొంత ప్లస్ అవుతుంది.
ధ్రువ విక్రమ్ నటించిన బైసన్ సినిమా తమిళ్లో అక్టోబర్ 17న విడుదలైంది. అక్కడ కోలీవుడ్ వర్గాల్లో ఈ సినిమాకి మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. తెలుగులో విడుదలకు సిద్ధం చేశారు కాబట్టి తమిళ్ వెర్షన్ హైదరాబాదులో రిలీజ్ కాలేదు.
అక్టోబర్ 24న రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ధ్రువ విక్రం ఈ సినిమాను ప్రత్యేకంగా తీసుకుంటున్నారు. ఇదే తన డెబ్యూ ఫిలిం అని ఫీలింగ్ లో ఉన్నాడు ధ్రువ విక్రమ్. ఇంతకుముందు ఆదిత్య వర్మ అనే సినిమాను కూడా చేశాడు. అయితే ఆ సినిమా రీమే కాబట్టి దానిని పరిగణలోకి తీసుకోలేదు. అలానే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన మహాన్ సినిమాలో కూడా కనిపించాడు.
Also Read: Rc 17: రామ్ చరణ్ సరసన కృతి సనన్, సుకుమార్ ఈసారైనా హిట్ ఇస్తాడా?