Megastar Chiranjeevi: శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తర్వాత వరుసగా మల్టీ స్టార్ సినిమాలు రావడం మొదలయ్యాయి. ఇప్పటివరకు వచ్చిన అన్ని మల్టీస్టారర్ సినిమాలలో రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ నటించిన ట్రిపుల్ ఆర్ సినిమా టాప్ లో ఉంటుంది. తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచిన సినిమా త్రిబుల్ ఆర్.
ఇకపోతే ఇప్పుడు సీనియర్స్ స్టార్ హీరోస్ కూడా మల్టీ స్టార్ సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. పండక్కి వస్తున్నారు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం స్వతహాగా అనిల్ రావిపూడి వినోదాత్మక సినిమాలు చేస్తాడు కాబట్టి. ఈ సినిమా కూడా ఎంటర్టైన్మెంట్ జోన్ లో ఉండబోతుంది.
మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్ర చేస్తున్నట్లు గతంలో అనౌన్స్మెంట్ వచ్చింది. మొత్తానికి వెంకటేష్ నేడు మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యారు. వెంకటేష్ ఈ సెట్స్ లో జాయిన్ అయినా వీడియోను రేపు విడుదల చేయనున్నారు.
గతంలో పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాలో వెంకటేష్ ఒక గెస్ట్ పాత్రలో కనిపించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కి, పవన్ కళ్యాణ్ కి వెంకటేష్ క్లోజ్ కావడం వలన ఆ గెస్ట్ పాత్రలో కనిపించారు. సినిమా రిలీజ్ అప్పుడు అది పెట్టలేదు కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ క్లిప్ సినిమాలో యాడ్ చేశారు.
అప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో కనిపించిన వెంకటేష్ ఇప్పుడు మళ్లీ చిరంజీవి గారి సినిమాలో కనిపిస్తున్నాడు. అనిల్ రావిపూడి కి ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. అందుకే అతనికి ఇప్పటివరకు 100% సక్సెస్ రేట్ ఉంది. అయితే వెంకటేష్ కి ఎటువంటి పాత్ర క్రియేట్ చేశాడు అనే క్యూరియాసిటీ చాలామందిలో ఇప్పటికే మొదలైంది.
విక్టరీ వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యకించి చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ వన్ అనే సినిమా చేశాడు వెంకటేష్. ఆ తర్వాత వచ్చిన ఎఫ్2 సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. మరోసారి ఎంటర్టైన్మెంట్ సినిమాను ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తారు అని ప్రూవ్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. మొత్తానికి ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలను ఒకే సినిమాలో చూడటం అనేది ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చే విషయం.
Also Read: Naga Vamsi: ఓజీ సినిమాలో కళ్యాణ్ అసలేం చేశారు ? నిర్మాత నాగవంశీ షాకింగ్ కామెంట్