BigTV English

Devara 2: దేవర 2 లో కోలీవుడ్ స్టార్… గట్టిగానే ప్లాన్ చేస్తున్న కొరటాల!

Devara 2: దేవర 2 లో కోలీవుడ్ స్టార్… గట్టిగానే ప్లాన్ చేస్తున్న కొరటాల!

Devara 2: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఎన్టీఆర్ తన సినిమాలన్నింటినీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈయన తెలుగు ఇండస్ట్రీ నుంచి దేవర (Devara)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా విడుదలై సరిగా ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేవర 2(Devara 2) సినిమాపై కూడా ఎన్నో అంచనాలు ఏర్పడటమే కాకుండా ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.


దేవర2 లో కోలీవుడ్ స్టార్ శింబు..

ఒకానొక సమయంలో దేవర 2 ఉండదని వార్తలు బయటకు వచ్చాయి కానీ దేవర విడుదలై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా దేవర 2 కూడా ఉండబోతుందని అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులను కూడా ప్రారంభించబోతున్నారు అంటూ తెలియజేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొరటాల శివ(Koratala Shiva) ఇదివరకు ఈ సినిమా కోసం అనుకున్న స్క్రిప్ట్ మొత్తం మార్చేసారని తెలుస్తోంది .ఈసారి హీరో పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండే విధంగా స్క్రిప్ట్ రాయబోతున్నారని సమాచారం. అదేవిధంగా ఈ సినిమాలో మరొక స్టార్ హీరోని కూడా భాగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు(Simbu) కీలకమైన పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది.

దేవర 2 మరో హీరోయిన్..

శింబు కోసం కొరటాల ఒక పవర్ ఫుల్ పాత్రను డిజైన్ చేసినట్టు సమాచారం. అదేవిధంగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్(Janhvi Kapoor) నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జాన్వి కపూర్ మాత్రమే కాకుండా ఈమెతో పాటు మరొక హీరోయిన్ ని కూడా తీసుకోవాలని ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తుంది. మరి దేవర 2 గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.


డ్రాగన్ తరువాతే దేవర 2?

ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత దేవర 2 సినిమా పనులను ప్రారంభిస్తారా? లేకపోతే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పూర్తి అయిన తరువాతనే దేవర 2 సినిమాని మొదలు పెడతారా? అనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కొరటాల బాలకృష్ణతో కూడా ఓ సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి .ఎన్టీఆర్ సినిమా ఆలస్యమైతే కొరటాల బాలకృష్ణతో సినిమా చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా త్వరలోనే దేవరకు సంబంధించి అన్ని విషయాలను చిత్రబృందం అధికారకంగా వెల్లడించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించిన సంగతి తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ 27వ తేదీ దసరా పండుగను పురస్కరించుకొని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబట్టింది.

Also Read: Jayammu Nischayammuraa: ఓయమ్మా నాగ చైతన్యలో ఈ యాంగిల్ ఉందా.. గుట్టు రట్టు చేసిన జగ్గు భాయ్!

Related News

Allu Arjun : నెక్స్ట్ లెవెల్ డాన్స్ మూవ్స్, అల్లు అర్జున్ కోసం జపనీస్ కొరియోగ్రాఫర్

Akhanda 2 : ఆ రిసార్ట్ లో పార్టీ చేసుకుంటున్న అఖండ 2 టీం

The Raaja Saab : ఎందుకండీ ఈ త్యాగాలు? అక్కడ లేటుగా రాజా సాబ్ రిలీజ్

Avika Gor: ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో అవికా గోర్.. ఘనంగా మెహందీ వేడుక!

Chiranjeevi: చిరంజీవిపై బాలయ్య వ్యాఖ్యలు.. చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఆందోళనలు!

Raja Saab Trailer: రాజా సాబ్ ట్రైలర్ వచ్చేసింది, ఇక రెచ్చిపొండి డార్లింగ్స్ 

Srinidhi Shetty: రామాయణ అసలు సీత శ్రీనిధి శెట్టినా…మరి సాయి పల్లవి ?

Big Stories

×