BigTV English

Akhanda 2 : ఆ రిసార్ట్ లో పార్టీ చేసుకుంటున్న అఖండ 2 టీం

Akhanda 2 : ఆ రిసార్ట్ లో పార్టీ చేసుకుంటున్న అఖండ 2 టీం

Akhanda 2 : బాలకృష్ణ ఎంత మంది దర్శకులతో పనిచేసిన కూడా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయడం అనేది ప్రత్యేకం. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ అయ్యాయి. ఒక దర్శకుడు ఒక హీరోతో సినిమా చేసినప్పుడు రిపీట్ గా సక్సెస్ కొడుతున్నారు అంటే ఆ హీరోని ఆ దర్శకుడు విపరీతంగా ప్రేమించి ఉండాలి.


అందుకే చాలామంది స్టార్ హీరోలకు వాళ్ళ అభిమానులు వచ్చి సినిమా చేసి సూపర్ హిట్స్ ఇస్తారు. బాలకృష్ణ మాత్రమే కాకుండా బోయపాటి శ్రీను కూడా ఎంతమందితో చేసిన బాలకృష్ణతో చేసినప్పుడు వచ్చిన పేరు రాదు. అది ఆ కాంబినేషన్ కి ఉన్న మ్యాజిక్. ప్రస్తుతం ఈ కాంబినేషన్లో అఖండ 2 సినిమా సిద్ధమవుతోంది.

ఆ రిసార్ట్ లో పార్టీ 

అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అఖండ 2 సినిమా వస్తుంది కాబట్టి దానిని నెక్స్ట్ లెవెల్ లో తీయాల్సిన అవసరం ఉంది. దీనికోసం చిత్ర యూనిట్ విపరీతంగా కష్టపడుతుంది. అయితే ఈ తరుణంలో అఖండ 2 కు పని చేసిన టీమ్ మెంబెర్స్ కు చేవెళ్ల లోని ఒక రిసార్ట్ లో దర్శకుడు బోయపాటి శ్రీను పెద్ద పార్టీ ఇస్తున్నట్లు తెలుస్తుంది.


సమిష్టి కృషి 

సినిమా అంటే సమిష్టి కృషి. ఏ ఒక్కరి వలన కూడా అది జరిగిపోదు. టీమ్ అంతా కూడా తమ పనిని ప్రేమిస్తూ సినిమా కోసం కష్టపడితే రిజల్ట్ కూడా అలానే వస్తుంది. కొన్నిసార్లు సినిమా ఫెయిల్ అవ్వడం కూడా జరుగుతుంది. కానీ బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ కాబట్టి ఆ ఊహ కూడా ప్రస్తుతానికి ఎవరికీ రాదు.

కమర్షియల్ సినిమాలకు బోయపాటి శ్రీను పెట్టింది పేరు. అలానే కమర్షియల్ గా కొన్ని అంశాలను డిజైన్ చేయడం మాత్రమే కాకుండా ఆయన సినిమాల్లో కొన్ని కుటుంబ విలువలు కూడా ఉంటాయి. ఒక నిండుదనం ఉన్న ఫ్యామిలీ బోయపాటి శ్రీను సినిమాల్లో కనిపిస్తుంటుంది. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్కువ శాతం బోయపాటి శ్రీను సినిమాలకు బ్రహ్మరథం పట్టే అవకాశాలు కూడా ఉంటాయి.

బ్లాక్ బస్టర్ వైబ్

మరోవైపు ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ విపరీతంగా ఆకట్టుకుంది. బాలకృష్ణ నుంచి ప్రేక్షకులు ఎటువంటి అంశాలను కోరుకుంటారో వాటిని సినిమాలో చాలా అద్భుతంగా బ్లెండ్ చేశాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఏదేమైనా బాలకృష్ణతో బోయపాటి సినిమా అంటేనే కంప్లీట్ సక్సెస్ వైబ్.

Also Read: The Raaja Saab : ఎందుకండీ ఈ త్యాగాలు? అక్కడ లేటుగా రాజా సాబ్ రిలీజ్

Related News

Devara 2: దేవర 2 లో కోలీవుడ్ స్టార్… గట్టిగానే ప్లాన్ చేస్తున్న కొరటాల!

Allu Arjun : నెక్స్ట్ లెవెల్ డాన్స్ మూవ్స్, అల్లు అర్జున్ కోసం జపనీస్ కొరియోగ్రాఫర్

The Raaja Saab : ఎందుకండీ ఈ త్యాగాలు? అక్కడ లేటుగా రాజా సాబ్ రిలీజ్

Avika Gor: ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో అవికా గోర్.. ఘనంగా మెహందీ వేడుక!

Chiranjeevi: చిరంజీవిపై బాలయ్య వ్యాఖ్యలు.. చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఆందోళనలు!

Raja Saab Trailer: రాజా సాబ్ ట్రైలర్ వచ్చేసింది, ఇక రెచ్చిపొండి డార్లింగ్స్ 

Srinidhi Shetty: రామాయణ అసలు సీత శ్రీనిధి శెట్టినా…మరి సాయి పల్లవి ?

Big Stories

×