BigTV English

Allu Arjun : నెక్స్ట్ లెవెల్ డాన్స్ మూవ్స్, అల్లు అర్జున్ కోసం జపనీస్ కొరియోగ్రాఫర్

Allu Arjun : నెక్స్ట్ లెవెల్ డాన్స్ మూవ్స్, అల్లు అర్జున్ కోసం జపనీస్ కొరియోగ్రాఫర్

Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. ఎన్నో కళాఖండాలు కూడా ఉన్నాయి. కానీ రోజులు మారుతున్న కొద్దీ విపరీతమైన మార్పులు కూడా సినిమా ఇండస్ట్రీలోనూ, మరోవైపు ఆడియన్స్ లోనూ జరుగుతున్నాయి.మూస ధోరణిలో వెళుతున్న తెలుగు సినిమా పాటలను తన డాన్సులతో ఊపు గలిగేలా చేసాడు మెగాస్టార్.


ఇప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవి అంటేనే డాన్సులకు పెట్టింది పేరు. ఆ గ్రేస్ ను అంత ఈజీగా ఎవరు మ్యాచ్ చేయలేరు. చాలామంది మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరోలో అబ్జర్వ్ చేసింది ఈ డాన్స్ ని. డాన్స్ వస్తే సరిపోతుందా అని కాదు. కానీ బాగా డాన్స్ చేయడం అనేది ఎక్స్ట్రా క్వాలిటీ. అది స్క్రీన్ మీద ఒక బ్యూటీ ని తీసుకొస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ చిరుతలోని మొదటి పాటతో అందరి సందేహాలకు చెక్ పెట్టేసాడు. అల్లు అర్జున్ కూడా డాన్స్ లో పర్ఫెక్ట్.

ఏకంగా జపనీస్ కొరియోగ్రాఫర్ 

ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు స్క్రీన్ పైన అద్భుతంగా డాన్స్ చేసే నటుడు ఎవరు అంటే కచ్చితంగా వినిపించే పేరు అల్లు అర్జున్. అల్లు అర్జున్ డాన్స్ చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంటుంది. అల్లు అర్జున్ డాన్స్ చూడడమే ఒక విజువల్ ట్వీట్. తన యాక్టింగ్ స్కిల్స్ తనకు ఎంతవరకు ప్లస్ అయ్యాయో డాన్స్ కూడా ఆ మేరకు ప్లస్ అయింది. అద్భుతమైన స్టెప్పులను అలవోకగా వేయడం అల్లు అర్జున్ కు కొత్త కాదు.


కాళ్లతో చెప్పు వదిలిన కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది. చేతితో టీ తాగినా కూడా డాన్స్ కనిపిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో బన్నీ డాన్స్ అందరూ చూసేసారు. ఇప్పుడు పాన్ వరల్డ్ స్థాయిలో డాన్స్ చూడ్డానికి సిద్ధమవ్వాలి. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా కోసం ఏకంగా జపనీస్ బ్రిటిష్ కొరియోగ్రాఫర్ అయిన హుకుటోకోనిసి (HokutoKonishi) సంప్రదించారు.

అఫీషియల్ క్లారిటీ 

ఇలా జపనీస్ కొరియోగ్రాఫర్ హుకుటోకోనిసి ఈ సినిమా కోసం చేస్తున్నట్లు ముందుగానే వార్తలు వచ్చాయి. కానీ ఏకంగా హుకుటోకోనిసి కొన్ని ఫొటోస్ షేర్ చేయడం వలన అందరికీ క్లారిటీ వచ్చేసింది. దీనిని బట్టి అట్లీ సినిమాలో అల్లు అర్జున్ చేయబోయే వరల్డ్ క్లాసు డాన్స్ చూడబోతున్నాము అని అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఒకవేళ ఇది ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేస్తే మాత్రం, ఈ మాత్రం దానికి అక్కడ నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏముంది మన దగ్గరే టాప్ కొరియోగ్రాఫర్లు ఉన్నారు కదా అని కామెంట్స్ కూడా వస్తాయి.

Also Read: Akhanda 2 : ఆ రిసార్టులో పార్టీ చేసుకుంటున్న అఖండ 2 టీం

Related News

Devara 2: దేవర 2 లో కోలీవుడ్ స్టార్… గట్టిగానే ప్లాన్ చేస్తున్న కొరటాల!

Akhanda 2 : ఆ రిసార్ట్ లో పార్టీ చేసుకుంటున్న అఖండ 2 టీం

The Raaja Saab : ఎందుకండీ ఈ త్యాగాలు? అక్కడ లేటుగా రాజా సాబ్ రిలీజ్

Avika Gor: ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో అవికా గోర్.. ఘనంగా మెహందీ వేడుక!

Chiranjeevi: చిరంజీవిపై బాలయ్య వ్యాఖ్యలు.. చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఆందోళనలు!

Raja Saab Trailer: రాజా సాబ్ ట్రైలర్ వచ్చేసింది, ఇక రెచ్చిపొండి డార్లింగ్స్ 

Srinidhi Shetty: రామాయణ అసలు సీత శ్రీనిధి శెట్టినా…మరి సాయి పల్లవి ?

Big Stories

×