Deepika Padukone Controversy: సినీ ఇండస్ట్రీలో 8 గంటల వర్క్ అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. ఈ కండిషన్ వల్ల స్టార్ హీరోయిన్ దీపికా భారీ ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తల్లయిన తర్వాత తన వర్క్ విషయంలో దీపికా నిబంధనలు పెడుతుంది. రోజుకి 8 గంటలే వర్క్ చేస్తానని, షూటింగ్ ఎక్కడ ఉన్న తనతో పాటు వచ్చే తన టీంకి కూడా లగ్జరీ హోటల్స్ కెటాయించాల్సిందేనంటూ కండిషన్స్ పెడుతుందనే వార్తలు వస్తున్నాయి. ఆమె గొంతెమ్మ కోరికల వల్ల స్పిరిట్, కల్కి 2 వంటి అతిపెద్ద ప్రాజెక్ట్స్ నుంచి ఆమెను తొలగించారు.
ప్రస్తుతం ఈ వ్యవహరం నార్త్, సౌత్ సంచలనంగా మారింది. ఈ విషయమై సినీ వర్గాలు సైతం సెటైర్లు విసురుతున్నారు. మరోవైపు నెటిజన్స్ నుంచి దీపికాకు తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలు, ట్రోల్స్పై దీపికా స్పందించింది. ఇటీవల ఓ అంగ్ల మీడివయాకు ఇచ్చిన ఇంటర్య్వూలో 8 గంటలే పని చేయడమనేది కొత్తగా వచ్చిన అంశం కాదు. ఇందులో రహస్యం ఏం లేదు. ఎంతోమంది స్టార్ హీరోలు కొంతకాలంగా ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తున్నారు. వారు హీరోలు కాబట్టి ఈ విషయం పెద్దగా బయటకు రాలేదు. మహిళను కాబట్టి దీన్ని పెద్ద రాద్దాం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఆ హీరోలు ఎవరనేది చెప్పి ఈ విషయాన్ని మరింత పెద్దది చేయడం ఇష్టం లేదు. కానీ, ఇండస్ట్రీలో 8 గంటల వర్క్ మాత్రం ఎప్పటి నుంచో ఉందని ఆమె చెప్పింది.
అప్పటి నుంచి బాలీవుడ్లో ఈ కండిషన్ పెట్టిన హీరోలు ఎవరా? అంతా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆ స్టార్ హీరో ఎవరో బయటపడింది. కాగా బాలీవుడ్లో ఎంతో పాపులరైన కామెడీ టాక్ షో ‘కపిల్ శర్మ షో‘ ఎన్నో సీజన్లను జరుపుకుంది. ఈ టాక్ షో నార్త్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏ సినిమా రిలీజ్ ఉన్న ఈ టాక్ షోలో పాల్గొని ప్రమోట్ చేస్తుంటారు. అయితే గతంలో హీరో అభిషేక్ బచ్చన్ అక్షయ్ కుమార్తో కలిసి ఈ టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ గురించి అభిషేక్ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయం చెప్పాడు.
Also Read: Pawan Kalyan: మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు.. నెలలుగా బెడ్పైనే ఉన్నారు..
“అక్షయ్కు ఉత్సాహం ఎక్కువ. అందుకే 8 గంటలు దాటితే అతడు సెట్లో ఉండడు. ఎనిమిది గంటలు మించి ఒక్క నిమిషం కూడా అతడు సెట్లో కనిపించడు. సెట్ నుంచి బయటకు రాగానే మేకప్, కాస్ట్యూమ్స్ అన్ని తీసేస్తాడు. ఒకవేళ షూటింగ్ షెడ్యూల్ ఉదయం 7 గంటలకే ఉంటే.. కచ్చితంగా ఆ సమయానికి సెట్లో ఉంటాడు” అని చెప్పుకొచ్చాడు. గతంలో అభిషేక్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాయి. దీపికా 8 గంటల వర్క్పై హీరోలు ఉద్దేశించిన చేసిన కామెంట్స్ అనంతరం అభిషేక్ గతంలో చేసిన ఈ కామెంట్స్ నెటిజన్స్ సోషల్ మీడయాలో వైరల్ చేస్తున్నారు. దీపికా చెప్పిన ఈ స్టార్ హీరోలో అక్షయ్ కుమార్ కూడా ఉన్నాడని, అతడు ఒక్కడేనా? ఇంకా వేరే హీరోలు కూడా ఈ కండిషన్ పెట్టారా? అంటూ కామెంట్స్ వస్తున్నాయి.