Kiran Abbavaram: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) త్వరలోనే ‘కె-ర్యాంప్’ (K-Ramp) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా అక్టోబర్ 18వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. తాజాగా ఈ ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని AAA సినిమాస్ లో నిర్వహించారు.ఈ ట్రైలర్ వీడియో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తోంది. ట్రైలర్ మొత్తం నాన్ స్టాప్ నవ్వులతో నిండిపోవడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.
ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అనంతరం చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మీడియా వారి నుంచి ఎన్నో రకాల ప్రశ్నలు రావడంతో చిత్ర బృందం కూడా సమాధానాలు చెబుతూ వచ్చారు. అయితే తాజాగా మరోసారి ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) సంబంధించిన వివాదం ఇక్కడ కూడా ప్రస్తావనకు రావడంతో సదరు జర్నలిస్ట్ కు కిరణ్ అబ్బవరం కౌంటర్ ఇచ్చారని తెలుస్తోంది. ఇటీవల డ్యూడ్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా ప్రదీప్ రంగనాథన్ ను ఉద్దేశించి ఒక లేడీ జర్నలిస్ట్ ఆయన లుక్స్ గురించి మాట్లాడటంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. అయితే ఇదే విషయం గురించి తాజాగా కిరణ్ అబ్బవరంకు ప్రశ్న ఎదురైంది.
ఈ సందర్భంగా జర్నలిస్టు మాట్లాడుతూ కిరణ్ అబ్బవరం గారు ఏ విధమైనటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ స్థాయికి రావడం అంటే మామూలు విషయం కాదు అయితే గత రెండు రోజుల క్రితం తాను హీరో ప్రదీప్ రంగనాథన్ ను ఈ విషయం గురించి ప్రశ్నించాను కానీ ఆయనను డి గ్రేట్ చేయాలని నా ఉద్దేశం కాదు. మీరు కూడా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇక్కడికి వచ్చారు ఈ విషయంపై మీరు ఏం సమాధానం చెబుతారని ప్రశ్న వేయడంతో వెంటనే కిరణ్ అబ్బవరం మీరు ఈ ప్రశ్న నన్ను అడగవచ్చు కానీ పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోని అడగడం మంచిగా లేదని తెలిపారు.
ప్రదీప్ రంగనాథన్ కి మద్దతు..
మీరు నన్ను ఎలాంటి ప్రశ్నలు వేసిన పర్వాలేదు మనం మనం ఒకటే కానీ పక్క రాష్ట్రం నుంచి ఒక హీరో వచ్చినప్పుడు మీ లుక్స్ బాగాలేవు అటు డీగ్రేట్ చేయడం తనని కించపరిచినట్లే, అలా కించపరిచి మాట్లాడొద్దు అంటూ తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. కిరణ్ అబ్బవరం ఇలా చెప్పడంతో మీరు కూడా నేను అడిగిన క్వశ్చన్ పూర్తిగా తెలుసుకోలేదు అంటూ మాట్లాడారు. కొంతమంది మీడియా వాళ్ళు కూడా నేను అడిగిన ప్రశ్నను కట్ చేసి మరి వైరల్ చేస్తున్నారంటూ ఈ సందర్భంగా సదరులేడి జర్నలిస్ట్ మాట్లాడారు.. అయితే ప్రదీప్ రంగనాథన్ విషయంలో కిరణ్ అబ్బవరం హీరోకి మద్దతుగా నిలబడి జర్నలిస్టుకు కౌంటర్ ఇస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read: Ring Riyaz: బై బై ఇండియా.. గల్లీ బాయ్ రియాజ్ వీడియో వైరల్..