Telusu Kada Trailer : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అతి తక్కువ మంది లేడీ డైరెక్టర్స్ ఉన్నారు. ప్రజెంట్ జనరేషన్ లో లేడీ డైరెక్టర్ ల ప్రస్తావన వస్తే అందరికీ గుర్తొచ్చేది నందిని రెడ్డి. అలా మొదలైంది సినిమాతో దర్శకురాలుగా ఎంట్రీ ఇచ్చి స్థిరపడిపోయారు నందిని. కాస్ట్యూమ్ డిజైనర్ గా మంచి గుర్తింపు సాధించుకున్న నీరజకోన తెలుసు కదా సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్న సంగతి తెలిసిందే.
నీరజ కోన దర్శకురాలుగా సిద్దు జొన్నలగడ్డ హీరోగా, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా తెలుసు కదా. ఈ సినిమా ఒక ట్రై యాంగిల్ లవ్ స్టోరీ. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను విశాఖపట్నంలో జరపాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది.
ఒక సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతుంది అంటే కనీసం వారం రోజులు ముందు ట్రైలర్ ఇవ్వాలి. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ ఇప్పటివరకు కూడా విడుదల కాలేదు. అక్టోబర్ 12న విడుదలవుతుంది అని అనౌన్స్ చేశారు. ట్రైలర్ ఈవెంట్ విశాఖపట్నంలో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం ఈ ఈవెంట్ కి పర్మిషన్ ఇవ్వలేదు.
ఈ విషయాన్ని స్వయంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈవెంట్ కొత్త ప్లేస్ ను త్వరలోనే అనౌన్స్ చేస్తాం అని తెలియజేశారు. రేపు ఈవెంట్ అంటే చివరి నిమిషంలో ఇలా వాళ్లకు ఎదురు దెబ్బ తగలడం అనేది కొద్దిపాటి నిరాశను మిగిల్చడమే.
Due to Security and Permission issues, #TelusuKada Trailer Launch Event scheduled in Visakhapatnam has been cancelled.
We will share the updated Date and Venue of #TelusuKadaTrailer Launch shortly.
— People Media Factory (@peoplemediafcy) October 11, 2025
రచయితగా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. గుంటూరు టాకీస్ సినిమా సిద్దుకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అంతంత మాత్రమే ఆడాయి. కానీ డీజే టిల్లు సినిమా సిద్ధూను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లి పోయింది. ఆ క్యారెక్టర్ సిద్దు డిజైన్ చేసిన విధానం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది.
ఆ తర్వాత వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించి దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన జాక్ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది.
ఇప్పుడు తెలుసు కదా సినిమాతో సిద్దుకి మంచి సక్సెస్ వస్తుంది అని అందరూ ఊహిస్తున్నారు. ఈ సినిమాలో విజువల్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. తమన్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
Also Read : Jeevitha Rajasekhar : సినిమా అయ్యాక డైరెక్టర్ ను పక్కకు తోసేశారు, డైరెక్టర్ ఆవేదన