OTT Movie : ఓటీటీలోకి ఒక సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేసింది. ఈ తమిళ సిరీస్ ఊహించని ట్విస్టులతో చిల్ల్లింగ్ థ్రిల్ ని ఇస్తోంది. ఈ కథ ఒక సినిమాలలో ఒక మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నా ఒక నటుడి చుట్టూ తిరుగుతుంది. అతనికి ఒక ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అరుణ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ బయోపిక్ లో నటించమని ఆఫర్ వస్తుంది. దీంతో స్టోరీ పూర్తిగా మారిపోతుంది. క్లైమాక్స్ వరకు ఉత్కంఠతను పెంచే సీన్స్ తో ఈ సిరీస్ ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? పేరు ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం ఆడండి.
‘వేడువన్’ (Veduvan) 2025లో వచ్చిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. పవన్ కుమార్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో కన్నా రవి, సంజీవ్ వెంకట్, శ్రావణితా శ్రీకాంత్, వినుషా దేవి, రేఖా నాయర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 7 ఎపిసోడ్ లతో వస్తున్న ఈ సిరీస్ IMDbలో 8.2/10 రేటింగ్ పొందింది. ఇది 2025 అక్టోబర్ 10 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది.
సూరజ్ అనే వ్యక్తి ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టర్. కానీ అతనికి మంచి అవకాశాలు రావు. మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తుంటాడు. ఒక రోజు ఒక డైరెక్టర్ అతనికి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అరుణ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ బయోపిక్ లో మైన్ రోల్ లో నటించమని అడుగుతాడు. ఇక సూరజ్ తనకి దశ తిరిగే అవకాశం వచ్చిందని సంబరపడతాడు. అరుణ్ గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో అరుణ్ ఒక పాపులర్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అని తెలుస్తుంది. అయితే అది ఒక వైపు మాత్రమే అని, మరోవైపు అతను ఒక పెద్ద అవినీతి పరుడని తెలుస్తుంది.
Read Also : పెళ్ళికి కొన్ని గంటల ముందు షాకిచ్చే వధువు… వరుడికి రెండు వింత కండిషన్స్… మస్ట్ వాచ్ మలయాళం మూవీ
దీంతో అరుణ్ నిజంగా హీరోనా లేక విలనా అనే సందేహం సూరజ్ కి కలుగుతుంది. అరుణ్ గురించి మరింత తెలుసుకోవడానికి అతను ప్రయత్నిస్తాడు. అరుణ్ ఎన్‌కౌంటర్స్ వెనుక అసలు మిస్టరీ బయటకి వస్తుంది. ఒక్క సారిగా ఆశ్చర్యపోయిన సూరజ్ ఈ బయోపిక్‌లో నటించడం ఎలా అని ఆలోచిస్తాడు. చివరికి సూరజ్ ఈ బయోపిక్ లో నటిస్తాడా ? పోలీస్ ఆఫీసర్ పాత్రని ఎలా చూపిస్తాడు ? అనే విషయాలను, ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ని చూసి తెలుసుకోండి.