Raviteja: టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ(Raviteja) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. కాగా ఇటీవల కాలంలో రవితేజ నటించిన సినిమాలో పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఆయన ఏమాత్రం తగ్గలేదు అని చెప్పాలి. అదేవిధంగా సినిమా అవకాశాలు కూడా తగ్గడం లేదు. సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ రవితేజతో సినిమాలు చేయడానికి డైరెక్టర్లు క్యూ కడుతున్నారని చెప్పాలి.
మొత్తంగా చూస్తే డైరెక్టర్ రవితేజ ప్రస్తుతం కాస్త డేంజర్ జోన్ లో ఉన్నారని చెప్పాలి. ఆ సంగతి పక్కన పెడితే.. రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మాస్ జాతర(Mass Jathara). ఈ సినిమాతో మాస్ జాతర చేయడానికి సిద్ధం అవుతున్నారు. భాను భోగవరపు(Bhanu Bogavarapu) దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించారు. ఇకపోతే ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న మూవీ మేకర్స్ ప్రస్తుతం ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే డైరెక్టర్ రవితేజ అలాగే హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) తాజాగా ముచ్చటించారు. హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా సినిమా ఈనెల 17వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ ఇద్దరు హీరోలు ముచ్చటించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఎన్నో అంశాల గురించి స్పందించారు రవితేజ, సిద్దు జొన్నలగడ్డ. కాగా ఆ వీడియోలో భాగంగా హీరో రవితేజ మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నాకు ఏదైనా కొంచెం డౌట్ వచ్చిందంటే అప్పుడే ఆ సినిమా ప్లాప్ అవుతుందని నాకు అర్థం అవుతుంది.
ఫ్లాప్ సినిమాలే ఫేవరెట్టా..
అలా నేను ఇది వరకు నటించిన సినిమాలు ఉన్నాయి కదా.. టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara rao), ఈగల్ వంటివి ప్లాప్ అవుతాయి అని నాకు ముందే తెలుసు. అలాగే నా ఆటోగ్రాఫ్ సినిమా కూడా ప్లాప్ అవుతుందని తెలుసు. ఈ మూడు సినిమాలు పోతాయని నాకు ముందే తెలుసు. కానీ నాకు ఈ మూడు సినిమాలు అంటే చాలా ఇష్టం. అవి నా ఫేవరెట్ మూవీస్ అని తెలిపారు రవితేజ. ఈ సందర్బంగా రవితేజ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మరి మాస్ జాతర సినిమాపై రవితేజ ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ సినిమా ఈయనకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.