Siddu Jonnalagadda: టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) త్వరలోనే తెలుసు కదా(Telusu Kada) అంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. దీపావళి పండుగను పురస్కరించుకొని ఈయన నటించిన ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. డైరెక్టర్ నీరజ కోన(Neeraja Kona) దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ, రాసి ఖన్నా, శ్రీ నిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశాయి.
ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం ఈసారి సిద్దు జొన్నలగడ్డ మరో హిట్ సినిమాని తన ఖాతాలు వేసుకుంటారని చెప్పాలి. ఈయన చివరిగా టిల్లు స్క్వేర్ అనే సినిమా ద్వారా హిట్ అందుకున్నారు. ఈ సినిమా తరువాత జాక్(Jack) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమా భారీ స్థాయిలో నష్టాలను ఎదుర్కొన్న నేపథ్యంలో సిద్దు జొన్నలగడ్డ తన రెమ్యూనరేషన్ కూడా కొంత భాగం వెనక్కి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే తెలుసు కదా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో రవితేజతో కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా జాక్ సినిమా గురించి ప్రస్తావనకు వచ్చింది. రవితేజ జాక్ సినిమా గురించి మాట్లాడొచ్చు కదా అంటూ ప్రశ్నించడంతో శుభ్రంగా మాట్లాడొచ్చు అంటూ సిద్దు తెలియజేశారు. ఈ సినిమా రిజల్ట్ గురించి ఇద్దరి మధ్య ప్రస్తావనకు రావడంతో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నాకు సినిమా మీద కాస్త డౌట్ వచ్చిందని తెలిపారు. తాను అనుకున్న విధంగానే ఈ సినిమా విడుదలైన తరువాత ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని తాను ఊహించిన విధంగానే సినిమా ఫలితం కూడా వచ్చిందని సిద్దు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
జాక్ పాట్ కొట్టలేకపోయిన సిద్దు..
కొన్ని సినిమాలు షూటింగ్ సమయంలోనే దర్శక నిర్మాతలు హీరోలు కూడా సినిమా రిజల్ట్ గురించి అంచనాలు వేస్తూ ఉంటారు. తప్పనిసరి పరిస్థితులలో ఆ సినిమాని పూర్తి చేసి విడుదల చేస్తుంటారు. ఇక జాక్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణంలో సిద్దు జొన్నలగడ్డ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాని ఏప్రిల్ 10 2025న విడుదల చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక నిర్మాతకు నష్టాలను మిగిల్చిందని చెప్పాలి.. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
Also Read: Kiran Abbavaram: పక్క స్టేట్ హీరోని కించపరిచొద్దు.. జర్నలిస్టుకు కౌంటర్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం!