Ram Charan : రామ్ చరణ్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సాధించుకున్న విషయం తెలిసిందే. కొత్తగా చరన్ గురించి పరిచయాల అవసరం లేదు. అందుకే ఏకంగా ఢిల్లీలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేసే ఘనత చరణ్ కు దక్కింది. అలానే చరణ్ దానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన సంగతి కూడా తెలిసింది.
లీగ్ ప్రారంభ సీజన్ విజయవంతంగా ముగిసినందుకు గుర్తుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (APL) చైర్మన్ అనిల్ కామినేని మరియు భారత ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవాతో కలిసి ఈరోజు న్యూఢిల్లీలో గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. ప్రధానమంత్రికి ఒక సింబాలిక్ విల్లును అందజేశారు.
మన ప్రధానమంత్రిని కలవడం మరియు ఆర్చరీ ప్రీమియర్ లీగ్ వెనుక ఉన్న దార్శనికతను పంచుకోవడం నిజంగా గౌరవంగా ఉంది. ఆర్చరీ మన సాంస్కృతిక వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగం, మరియు APL ద్వారా, దానిని తిరిగి అంతర్జాతీయ వెలుగులోకి తీసుకురావాలని మేము ఆశిస్తున్నాము. భారతదేశంలో ఈ రంగంలో అద్భుతమైన ప్రతిభ ఉంది మరియు ఈ వేదిక ప్రపంచ వేదికపై విజయం సాధించడంలో వారికి సహాయపడుతుంది.
రామ్ చరణ్ తో పాటు ఉపాసన కామినేని కొణిదెల ఉన్నారు. ఉపాసన…. చిరంజీవి తరపున గౌరవ ప్రధానమంత్రికి బాలాజీ విగ్రహం మరియు సాంప్రదాయ పూజా సామాగ్రి బహుకరించారు.
ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది అని సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగుతుంది. ఇదివరకే గోదావరి నేపథ్యంలో రామ్ చరణ్ చేసిన రంగస్థలం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. సినిమాలో చిట్టిబాబు పాత్ర ఇప్పటికీ కూడా మర్చిపోలేము.
ఇప్పుడు పెద్ది సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుంది అని చాలామంది అంచనా వేస్తున్నారు. రంగస్థలం సినిమాలో కూడా బుచ్చిబాబు ఇన్వాల్వ్మెంట్ చాలా వరకు ఉంది. ఇప్పుడు కూడా పెద్ది సినిమాను ఒక హై రేంజ్ తో బుచ్చిబాబు చేస్తున్నట్లు తెలుస్తుంది. సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన వీడియో అంచనాలను మరింత పెంచేసింది. ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ మాట్లాడిన తీరు చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది.
ఒక స్టార్ హీరో యాస మాట్లాడితే వచ్చే బ్యూటీ ఏంటో చాలా సినిమాల్లో మనం చూసాం. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు స్లాంగ్ మాట్లాడటం. అరవింద సమేత వీర రాఘవ సినిమాలో ఎన్టీఆర్ రాయలసీమ యాసను మాట్లాడటం ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది.
Also Read: Jeevitha Rajasekhar : సినిమా అయ్యాక డైరెక్టర్ ను పక్కకు తోసేశారు, డైరెక్టర్ ఆవేదన