Sai Durga Tej at T-Hub: హైదరాబాద్ టీ–హబ్ మెగా హీరో సాయి దుర్గ తేజ్ సందడి చేశారు. ఆటో మొబైల్ రంగంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచుతూ స్టూడెండ్ ట్రైబ్ ఆధ్వ్యంలో ‘ఫాస్ట్ అండ్ క్యూరియస్-ది GenZ ఆటో ఎక్స్ పో 2025‘ని టీ హబ్ వేదికగా నిర్వహించారు. దీనిని సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ శనివారం(అక్టోబర్ 11) ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా మోడ్రన్ వెహికిల్స్ స్పెషల్ అండ్ సూపర్ స్పిడ్ కార్లతో పాటు ఓజీ, కాంత చిత్రాల్లోని కార్లను కూడా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి లాంచ్ చేసిన హీరో సాయి దుర్గ తేజ్ని చూసేందుకు ఫ్యాన్స్ భారీగా ఎత్తున్న తరలివచ్చారు. దీంతో టీ–హబ్ ఫ్యాన్స్ కోలాహలంగా సందడిగా మారింది.
ఈ కార్యక్రమంలో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా ది జెన్ జెడ్ ఆటో ఎక్స్ విద్యార్థులు, క్రియేటర్లు, ఆటోమొబైల్ అభిమానులకు ఒకే వేదికపై నేర్చుకునే, ఆలోచనలు పంచుకునే, కెరీర్ అవకాశాలను పరిశీలించే ప్రత్యేక అవకాశం కల్పించండం అభినందనీయమన్నారు. అలాగే స్టూడెంట్ ట్రైబ్ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీ చరణ్ లక్కరాజు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఆటోమొబైల్ రంగంలో ఉన్న కెరీర్ అవకాశాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించడమే ఈ ఆటో ఎక్స్ పో ముఖ్య ఉద్దేశమన్నారు. పరిశ్రమ నిపుణులతో నేరుగా సంభాషిస్తూ, కొత్త ట్రెండ్స్ నేర్చుకునే అద్భుతమైన వేదిక ఇదన్నారు. అనంతరం జెనెక్స్ నిర్వాహకులు అమర్ మాట్లాడుతూ.. ఈ షోలో ఇన్నోవేషన్, ఎనర్జీ, సృజనాత్మకత ప్రతిబింబిస్తున్నాయని, ఓజీ వంటి ప్రఖ్యాత సినిమాల్లో వాడిన స్పెషల్ కార్లు ఆటోమొబైల్ పరిశ్రమ సినీ ప్రపంచంతో ఎలా మిళితమైందో చూపిస్తున్నాయని పేర్కొన్నారు.
Also Read: Pawan Kalyan: మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు.. నెలలుగా బెడ్పైనే ఉన్నారు..
రాష్ట్రంలోని 100కు పైగా కాలేజీల నుంచి 2వేలకు పైగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఆటోమొబైల్ ప్రపంచాన్ని అన్వేషించేందుకు, నేర్చుకోవడానికి, మమేకం కావడానికి ఈ ప్రదర్శన ప్రత్యేక వేదికగా నిలిచిందని విద్యార్థులు అన్నారు. ముఖ్యంగా మారిస్ ఆక్స్ ఫర్డ్ 1951, బ్యూయిక్ 1945, డిసోటో 1946, కాంతారా సినిమాలో ని విన్ టేజ్ కార్లు, భారతదేశపు వేగవంతమైన ఆడి R8, అలాగే పవన్ కళ్యాణ్ ‘ఓజీ‘ సినిమాలో ఉపయోగించిన డాడ్జ్ కింగ్స్‌వే 1955 వంటి ప్రత్యేక కార్లు గురించి తెలుసుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించారు. వీటితో పాటు మరి కొన్ని సూపర్‌కార్లు కూడా ప్రదర్శనలో భాగమయ్యాయి. అదే విధంగా ఆటోమొబైల్ డిజైన్, ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగాల్లో కెరీర్ అవకాశాలను పరిచయం చేసే వర్క్‌షాప్‌లు, ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా నిర్వహించడం తమకు ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు తెలిపారు.