BigTV English

Sundarakanda Movie: నారా వారి మూవీలో మంచు హీరో… ఎక్కడో బంధం కలుస్తుంది

Sundarakanda Movie: నారా వారి మూవీలో మంచు హీరో… ఎక్కడో బంధం కలుస్తుంది

Nara Rohit Sundarakanda Movie: నారా రోహిత్‌ మొదటి నుంచి విభిన్న కథలతో అలరిస్తున్నాడు. ఎప్పుడో ఇండస్ట్రీలోకి వచ్చిన రోహిత్‌ సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. బాణంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సోలో, ప్రతినిధి, సోలో,రౌడీ ఫెలో, అసుర వంటి ఎన్నో సినిమాలు చేశాడు. అలాగే స్టార్‌ హీరోల సినిమాల్లో సహాయక పాత్రలు చేశాడు. 2018లో వీర భోగ వసంత రాయలు మూవీతో వచ్చిన ఈ నారా హీరో ఆ తర్వాత కొంత గ్యాప్‌ తీసుకున్నాడు. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత 2024లో ప్రతినిధి మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు.


రీఎంట్రీలో నారా హీరో దూకుడు

ఈ మూవీ మంచి విజయం సాధించింది. ప్రతినిధితో మంచి హిట్‌ కొట్టిన రోహిత్‌.. ప్రస్తుతం బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తున్నాడు. వరుసగా సినిమాలకు కమిటై.. లైన్‌లో పెడుతున్నాడు. ఇటీవల భైరవం మల్టీస్టారర్‌గా వచ్చిన నారా రోహిత్‌.. సుందరకాండతో సింగిల్‌గా రాబోతున్నాడు. అయితే ఈ సినిమాలో మంచు హీరో నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. నారా రోహిత్‌ హీరోగా డెబ్యూ డైరెక్టర్‌ వెంకటేష్‌ నిమ్మలపూడి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందిన ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా రేపు (ఆగష్టు 27) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటి ఈ చిత్రం నుంచి వచ్చి ప్రచార పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.


గెస్ట్ రోల్లో మంచు హీరో

ఇక భైరవం మంచి విజయం సాధించడంతో సుందరకాండ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రేపు విడుదలకు సిద్దమౌవుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఇందులో నారా రోహిత్‌తో పాటు మరో హీరో నటిస్తున్నారట. మంచు హీరో మనోజ్‌ సుందరకాండలో అతిథి పాత్ర పోషిస్తున్నాడు. ఇది తెలిసి అభిమానులంత సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. కాగా భైరవంలో రోహిత్‌తో కలిసి మనోజ్‌ నటించిన సంగతి తెలిసిందే. ఇందులో వీరిద్దరు మంచి స్నేహితులుగా కనిపించారు. ఇప్పుడు సుందరకాండలో మనోజ్‌ నటిస్తున్నాడని తెలిసి.. వీరిద్దరి బాండింగ్‌ గురించే మాట్లాడుకుంటున్నారు.

Also Read: Mirai New Release Date: మళ్లీ వాయిదా పడ్డ మిరాయ్‌, ట్రైలర్‌ అప్‌డేట్‌తో షాకిచ్చిన మూవీ టీం!

ఇండస్ట్రీలో వీరిద్దరు మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. వీరి మధ్య ఉన్న సన్నిహితం వల్లే భైరవంలో ఇద్దరిని తీసుకున్న డైరెక్టర్‌ అజయ్‌ కుమార్‌. ఇప్పుడు సుందరకాండలోనూ మనోజ్‌ నటిస్తుండటంతో వీరి ఫ్యాన్స్‌ ఖుష్‌ అవుతున్నారు. కాగా ఈ చిత్రంతో శ్రీదేవి విజయ్‌ కుమార్‌ మళ్లీ టాలీవుడ్‌ రీఎంట్రీ ఇస్తున్నారు. నారా రోహిత్‌ 20వ చిత్రంగా సుందరకాండ తెరకెక్కింది. సందీప్‌ పిక్చర్‌ ప్యాలెస్‌ బ్యానర్‌పై సంతోష్‌ చిన్నపొల్ల, గౌతమ్‌ రెడ్డి, రాకేష్‌ మహంకాళి నిర్మిస్తున్నారు. యువ నటి వ్రితి వాఘని ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో రోహిత్‌ రెండు ప్రేమకథల్లో కనిపిస్తాడని సమచారం. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత మరోసారి లవ్‌ ఎంటర్‌టైన్‌తో వస్తున్న నారా రోహిత్‌ సుందరకాండతో హిట్‌ అందుకుంటాడా? లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.

Related News

Actress Meena: గీతాంజలి సినిమా మీనా చేయాల్సిందా.. అలా మిస్ చేసుకుందా?

Nithiin: లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ తో నితిన్ మూవీ… అంతా తమ్ముడు ఎఫెక్ట్

Chiranjeevi: నూతన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ను కలిసిన చిరంజీవి !

Sai Dharam Tej : అల్లు అర్జున్ గురించి సాయి తేజ్ లేటెస్ట్ కామెంట్స్, ఆయన ఇప్పుడు గొప్పోళ్ళు అయిపోయారు

Mowgli Release Date: మొగ్లీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ , క్రేజీ వీడియో

K- Ramp Trailer delay : ఈ దర్శక నిర్మాతలు మారరా, ప్రేక్షకులతో ఆడుకోవడమే పని అయిపోయిందా

Silambarasan TR: ఆ షార్ట్ ఫిలిం డైరెక్టర్ ని పట్టుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్, ఏకంగా శింబు తో సినిమా

‎Raviteja: ఆ డిజాస్టర్ సినిమాలంటే ఇష్టమన్న మాస్ హీరో..ఆ డౌట్ వస్తే సినిమా పోయినట్టేనా?

Big Stories

×