Raviteja: టాలీవుడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సిద్దూ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. సిద్దూ నటించిన సినిమాలలో డీజే టిల్లు సినిమా భారీగా గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు సిద్దు జొన్నలగడ్డ. ఇది ఇలా ఉంటే సిద్దు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ తెలుసు కదా(Telusu Kada) ఈ సినిమా అక్టోబర్ 17 వ తేదీ విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ డ్రామా రూపొందిన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది.
కాగా ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ లుగా నటించారు. లేడి డైరెక్టర్ నీరజ కోన(Neeraja Kona) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇదివరకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన నీరజ కోన ఈ సినిమాతో మొదటిసారిగా డైరెక్టర్ గా పరిచయం కాబోతోంది. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, టి.జి.కృతిప్రసాద్ నిర్మించారు. ఇకపోతే త్వరలోనే సినిమా విడుదల కానున్న సందర్బంగా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు సిద్దు జొన్నలగడ్డ.
అందులో భాగంగానే రవితేజ(Raviteja) తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మరోవైపు మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ జాతర సినిమా కూడా ఈనెల అనగా అక్టోబర్ 31వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇద్దరి సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో వీరిద్దరూ కలిసి సరదాగా ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా రవి తేజ మాట్లాడుతూ లేడీ డైరెక్టర్ నీరజ కోనపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా రవితేజ మాట్లాడుతూ.. నీరజతో పనిచేయడం ఎలా ఉంది అని అడగగా.. సిద్దు మాట్లాడుతూ.. ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అనగా తను చాలా ఎమోషనల్ ని రవితేజ అనగా అవును తను ఎమోషనలి వెరీ స్ట్రాంగ్.
మగవాడిలక్షణాలు ఉన్నాయి..
తను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఎమోషనల్ వెరీ స్ట్రాంగ్ అని తెలిపారు. అప్పుడు వెంటనే రవితేజ మాట్లాడుతూ.. ఆడవారిలో మగవారి లక్షణాలు మగవారిలో ఆడవారి లక్షణాలు ఉంటాయని అంటారు. తనలో కొంచం మగవాడి లక్షణాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి అనడంతో నవ్విన సిద్దు అవును అని అన్నారు. మీరు ఈ సినిమా చూస్తే నిజంగా ఈ సినిమాను ఒక అమ్మాయి తీసిందా అని మీకు అనిపిస్తుంది అని తెలిపారు సిద్దు జొన్నలగడ్డ. అలా రవితేజ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే తెలుసు కదా సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 12న విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇక చివరి నిమిషంలో ఈ కార్యక్రమానికి ఏపీ పోలీసుల నుంచి అనుమతి లభించని నేపథ్యంలో వాయిదా పడింది. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల అయిన అప్డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
Also Read: Kiran Abbavaram: పక్క స్టేట్ హీరోని కించపరిచొద్దు.. జర్నలిస్టుకు కౌంటర్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం!