Stray Dogs Attack: వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న బాలికపై ఒక్కసారిగా దాడి చేశాయి. బాలికపై దాడి ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. కుక్కల దాడిలో బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి. హన్మకొండ జిల్లా న్యూశాయంపేటలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న శ్రీజ(7) అనే బాలికపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. వెంటనే స్థానికులు గమనించి కుక్కలను తరమడంతో బాలికకు ప్రాణాపాయం తప్పింది. గాయపడ్డ బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీధి కుక్కల బెడదను నివారించడంలో మున్సిపల్ అధికారుల అలసత్వం వహిస్తు్న్నారని స్థానికులు మండిపడుతున్నారు. బాలికపై వీధి కుక్కల దాడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
వీధి కుక్కల దాడిలో బాలికకు తీవ్ర గాయాలు.. సీసీ ఫుటేజ్
హన్మకొండ జిల్లా న్యూశాయంపేటలో ఘటన.
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న శ్రీజ(7) అనే బాలికపై మూకుమ్మడి దాడి చేసిన వీధి కుక్కలు.
స్థానికులు గమనించి కుక్కలను తరమడంతో తప్పిన ప్రాణాపాయం.
గాయపడ్డ బాలికను చికిత్స నిమిత్తం… pic.twitter.com/K5c2BKBQYh
— ChotaNews App (@ChotaNewsApp) October 26, 2025
నిజామాబాద్ జిల్లా బాల్కొండలో విషాదం చోటుచేసుకుంది. 10 ఏళ్ల గడ్డం లక్ష్మణ అనే బాలిక కుక్క కాటుకు గురైంది. ఈ విషయం ఇంట్లో చెప్పకపోవడంతో నెల రోజుల తర్వాత రేబిస్ వ్యాధితో బాలిక మృతి చెందింది. భయంకరమైన రేబిస్ వ్యాధి గురించి తెలియక, బాలిక కుక్క కరిచిన విషయాన్ని తల్లిదండ్రులు చెప్పలేదు. నెల రోజుల క్రితం లక్ష్మణపై కుక్క దాడి చేసింది. ఈ దాడిలో బాలిక తలకు గాయమైంది. ఈ విషయం తల్లిదండ్రులకు తిడతారని భయపడి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా దాచింది.
ఇటీవల బాలిక ప్రవర్తనలో మార్పు వచ్చింది. బాలిక కుక్కలా మొరగడం, అసాధారణంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దీంతో భయపడిన తల్లిదండ్రులు బాలికను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయిందని వైద్యులు తెలిపారు. రేబిస్ వ్యాధి ముదిరిపోయిందన్నారు. చికిత్స పొందుతూ బాలిక మరణించింది.
కుక్క కాటు చిన్న గాయంగా కనిపించినా, రేబిస్ వ్యాధికి దారితీయొచ్చని, అది ప్రాణాంతకమైన వ్యాధి అని వైద్యులు తెలిపారు. పెంపుడు కుక్క లేదా వీధి కుక్క.. ఏది కరిచినా వెంటనే ఆలస్యం చేయకుండా వెంటనే రేబిస్ టీకా తీసుకోవాలని వైద్యులు సూచిస్తు్న్నారు. చిన్న పిల్లలు కుక్క కాటును దాచిపెట్టే ప్రమాదం ఉన్నందని, తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే రేబిస్‌ను బయటపడొచ్చని వైద్యులు తెలిపారు.
Also Read: Husband Suicide: ఇంట్లో అత్త ఉండొద్దని భార్య గొడవ.. 15 వ అంతస్తు నుంచి దూకి భర్త ఆత్మహత్య