BigTV English

Kota vs Mega Family: మెగా ఫ్యామిలీకి, కోటాకు వార్ ఏంటి? సైలెంట్ అందుకేనా?

Kota vs Mega Family: మెగా ఫ్యామిలీకి, కోటాకు వార్ ఏంటి? సైలెంట్ అందుకేనా?

Kota vs Mega Family: ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే ఈయన విలక్షణ పాత్రలతో నటించి తనకంటూ సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకోగా, పలుమార్లు ఆయన చేసిన కామెంట్స్ వివాదానికి దారితీసాయి. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీకి కోటకు సైలెంట్ వార్ సాగుతూ వచ్చిందని సినీ విశ్లేషకుల అభిప్రాయం.


ఏదైనా పాత్రలో ఇట్టే ఇమిడిపోవడం, పాత్రకు న్యాయం చేయడంలో ఎవరైనా కోట శ్రీనివాసరావు తర్వాతే. అలాంటి ఆయన పలుమార్లు చేసిన కామెంట్స్.. మెగా కుటుంబానికి కాస్త ఇబ్బందిగా మారాయని చెప్పవచ్చు. అయితే ఈ కామెంట్స్ పై మెగా ఫ్యామిలీ నుండి ఎటువంటి విమర్శలు రాకపోవడం విశేషం.

తెలుగు సినీ పరిశ్రమలో కోటాకు ప్రత్యేక స్థానం ఉంది. కోట శ్రీనివాసరావు కోసమే పాత్రలు పుట్టించిన సినిమాలు సైతం ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా కామెడీ తరహాలో నటించిన సినిమాలలో బాబు మోహన్, కోట శ్రీనివాసరావుల జత ఉండాల్సిందే. అంతేకాదు సినిమాలలో రాజకీయ పాత్రలలో సైతం కోట శ్రీనివాసరావు నటించి ప్రజలను మెప్పించారు. సినిమాలలో నటించి మెప్పించిన కోట.. పలుమార్లు వివాదాస్పద కామెంట్స్ చేసి సంచలనం సృష్టించారు.


ఆది నుండి మెగాస్టార్ కుటుంబం లక్ష్యంగా కోటా శ్రీనివాసరావు వివాదాస్పద కామెంట్స్ చేశారన్న వాదన ఎప్పటి నుండో వినిపిస్తోంది. అయితే మెగా కుటుంబం మాత్రం ఆ విమర్శలను పట్టించుకోకుండా కోటా శ్రీనివాసరావు యొక్క పెద్దరికానికి విలువనిస్తూ వచ్చారని చెప్పవచ్చు. అందుకే ఆయన కామెంట్స్ పై మెగా ఫ్యామిలీ నుండి ఎవరు స్పందించకపోవడం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.

చిరంజీవి టార్గెట్ గా..
ఎన్నో సేవా కార్యక్రమాలతో మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలోని కార్మికులకు అండగా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే చిత్రపురిలో మెగాస్టార్ వైద్యశాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపించిన క్రమంలో కోట రంగంలోకి దిగారు. ముందు సినీ కార్మికులకు తిండి పెట్టండి.. ఆ తర్వాత వైద్యశాల గురించి ఆలోచించండి అంటూ కోటా సంచలన కామెంట్స్ చేశారు.

అంతటితో ఆగక కృష్ణానగర్ లో చాలామంది దర్శకులు పని పాట లేక మద్యానికి బానిసై తందనాలు ఆడుతున్నారని ముందుగా వారికి పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోట కామెంట్ చేశారు. అలాగే తాను ఇప్పటివరకు ఎందరో సినీ ఆర్టిస్టులకు సాయం చేసి ఉంటానని, అటువంటి సాయాన్ని అందించాలని మెగాస్టార్ చిరంజీవికి పరోక్షంగా ఆ సమయంలో కోటా సలహాలు ఇచ్చారు. ఇలా కోటా చేసిన కామెంట్స్ మెగాస్టార్ ను టార్గెట్ చేసినట్లుగా నాడు తెలుగు సినీ పరిశ్రమ కోడై కూసింది.

Also Read: Kota Srinivasarao: బర్త్ డే జరుపుకున్న రెండు రోజులకే.. అందరిని చూసి.. కలిసి.. కోటాకు ఏమైంది?

ఇటీవల పవన్ కళ్యాణ్ లక్ష్యంగా..
ఓ సినిమా వేడుకలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, తాను ప్రతి సినిమాకి 2 కోట్ల నుండి 6 కోట్ల వరకు తీసుకుంటానని.. డబ్బే ప్రధానమైతే రాజకీయాలకు స్వస్తిపలికి సినిమాలలోనే కొనసాగే నైజం తనకు ఉండాలన్నారు. తాను కేవలం ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ ఆ సమయంలో చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ పై కోటా సైతం రియాక్ట్ అయ్యారు. సినిమాలు అప్పటిలా లేవని ఇప్పుడు అంతా సర్కస్ లా ఉందంటూ కోట చెప్పుకొచ్చారు.

2 కోట్ల, 6 కోట్లు తీసుకుంటున్నామని పబ్లిక్ గా నటులు చెబుతున్నారని, నాటి సీనియర్ నటులు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో ఎవరికైనా తెలుసా అంటూ కోటా ప్రశ్నించారు. ఈ విషయం అందరికీ చెప్తున్నానంటూ కూడా చెప్పడం విశేషం.

అంతేకాదు మా ఎన్నికల సమయంలో కూడా మెగాస్టార్ ఫ్యామిలీ మద్దతుగా తెరపైకి వచ్చిన ప్రకాష్ రాజ్ ను విమర్శిస్తూ కోట కామెంట్స్ చేయడం ఎన్నికల సమయంలో దుమారం రేపింది. కోట శ్రీనివాసరావు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ పలుమార్లు కామెంట్స్ చేయడంపై మెగా కుటుంబం నుండి ఎటువంటి రియాక్షన్ లేకపోవడం విశేషం. ఇక నాగబాబు లక్ష్యంగా అయితే రాజకీయాలు ఎందుకు అంటూ కోటా చేసిన కామెంట్స్ దుమారం లేపాయి.

ఏది ఏమైనా కోట శ్రీనివాసరావు కామెంట్స్ కు.. సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ విలువనిస్తూ ఎటువంటి విమర్శలు చేయకుండానే సైలెంట్ గా ఉండడం ఆయన పెద్దరికానికి విలువనివ్వడమేనని చెప్పవచ్చు. సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న కోట.. టాలీవుడ్ చరిత్రలో ఇటువంటి నటుడు లేడు అనే స్థాయికి చేరుకున్నారు.

చిరు ట్వీట్..

కోట శ్రీనివాసరావు మృతి చెందడంపై మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేస్తూ, ట్వీట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు కోట లేని లోటు తీర్చలేనిదని, ఆయన పాత్రలలో జీవించి నటించే వారని కొనియాడారు.

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×