Train Fire Incident: చెన్నైలో ఇంధనంతో వెళ్తున్న గూడ్స్ రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. కార్గో ఆయిల్ ట్యాంకర్ పట్టాలు తప్పడంతో మంటలు చెలరేగాయి. చెన్నైలోని తాండియార్‌పేట నుండి అరక్కోణం మీదుగా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రైలులో ఇంధనం ఉండటంతో మంటలు మరింత వ్యాపించి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీని కారణంగా అరక్కోణం నుంచి చెన్నైకి వెళ్లే అన్ని ఎలక్ట్రిక్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. చెన్నై వైపు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లు వివిధ ప్రదేశాలలో మధ్యలోనే ఆగిపోయాయి.
ప్రమాదం ఎలా జరిగింది?
ప్రాథమిక సమాచారం ప్రకారం, గూడ్స్ రైలు పూర్తిగా ఇంధనంతో నిండి ఉంది. తాండియార్‌పేట నుంచి బయలుదేరిన ఈ రైలు అరక్కోణం వైపు వెళ్తుండగా, మార్గ మధ్యలోని ఓ వంతెన దగ్గర లోకోమోటివ్ (ఇంజిన్) వెనుక ఉన్న ఆయిల్ ట్యాంకర్లలో.. ఒకటి అదుపుతప్పి పట్టాలు తప్పింది. అదే సమయంలో మంటలు చెలరేగి ఒక్కసారిగా విస్తృతంగా వ్యాపించాయి. ట్యాంకర్‌లో ఉన్న భారీ స్థాయిలో డీజిల్ వల్ల మంటలు మరింతగా వ్యాపించి, చుట్టుపక్కల దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
రెస్క్యూ చర్యలు
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపు చేయడానికి నాలుగు ఫైర్ టెండర్లు వినియోగిస్తున్నారు. మంటల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సుమారు రెండు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని ఖాళీ చేయించారు.
రైళ్ల రద్దు – ప్రయాణికుల ఇబ్బందులు
ఈ ప్రమాదంతో అరక్కోణం–చెన్నై రూట్లో రైళ్ల రాకపోకలపై తీవ్రమైన ప్రభావం పడింది. దక్షిణ రైల్వే అధికారులు అన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. కొన్ని రైళ్లు మధ్యలోనే ఆగిపోయాయి. అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణికులతో సహా స్టేషన్లలో నిలిచిపోయాయి. ముఖ్యంగా ముంబై, బెంగళూరు, కోయంబత్తూరు నుంచి వచ్చే రైళ్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
ప్రయాణికుల హడావిడి
చెన్నై చేరాల్సిన వందలాది మంది ప్రయాణికులు స్టేషన్లలో ఇరుక్కుపోయారు. ఎటూ పోనీలేని పరిస్థితిలో గంటల తరబడి వేచిచూస్తున్నారు. రాత్రి 10 గంటలకే రైలు రావాల్సింది.. కానీ ఇప్పటికీ రాలేదు. ఏ సమాచారమూ లేదు అంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైల్వే అధికారులు శరవేగంగా క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, మంటలు పూర్తిగా ఆర్పే వరకు ట్రాక్‌ను పునరుద్ధరించలేని పరిస్థితి నెలకొంది.
అగ్ని ప్రమాదానికి కారణాలు?
ఈ ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు.. రైల్వే సేఫ్టీ కమిటీ విచారణ ప్రారంభించింది. ఇంధనాన్ని రవాణా చేయడంలో ఉన్న భద్రతా లోపాలు, ట్యాంకర్ల నిర్వహణలో సంరక్షణ లోపాలు ఉన్నాయా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇలాంటి గూడ్స్ రైళ్ల ప్రమాదాలు జరిగిన సందర్భాలను.. పరిశీలించనున్నట్లు సమాచారం.
పర్యావరణానికి ముప్పు
ఈ ఘటన పర్యావరణానికి కూడా ముప్పు కలిగించే ప్రమాదం ఉంది. ఆయిల్ ట్యాంకర్ నుంచి కారుతున్న ఇంధనం భూమిలోకి కలుస్తూ ఉండటంతో.. నేల, సమీప నీటి వనరులకు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. చెన్నై మున్సిపల్ అధికారులు, పర్యావరణ శాఖ అధికారులు దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు, ఎప్పటి నుంచి అంటే?
ఈ ప్రమాదం మరోసారి రైల్వేలో ఇంధన రవాణా భద్రతా ప్రమాణాలపై.. అనేక సందేహాలు రేకెత్తిస్తోంది. ప్రయాణికుల భద్రత కంటే కూడా, భారీ విపత్తులను నివారించేందుకు ముందస్తు చర్యలు.. ఎంతగానో అవసరమని ఈ సంఘటన గుర్తుచేస్తోంది.
A fuel-laden railway tanker caught fire near Tiruvallur.Thick black smoke and intense flames engulfed the area, disrupting train services.Firefighters are on the scene, & officials are investigating the cause.
#TrainFire #BreakingNews #ChennaiUpdates @NewIndianXpress@xpresstn pic.twitter.com/Pc3jwtJJDd— Ashwin Prasath (@ashwinacharya05) July 13, 2025