Madhuri Dixit: డ్రగ్ లార్డ్ గా, ఇండియా మాఫియా గ్యాంగ్ స్టార్ గా , నార్కో టెర్రరిస్ట్ గా కూడా పేరు సొంతం చేసుకున్న దావూద్ ఇబ్రహీం గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అలాంటి ఈయన సోదరుడి వల్ల ప్రముఖ స్టార్ హీరోయిన్ భయపడి నాలుగేళ్లు ఇండియాకు దూరంగా ఉందని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా తనను పెళ్లి చేసుకోలేదని ఆమెపై ఒక గ్యాంగ్ తో హత్యాయత్నానికి కూడా దావూద్ ఇబ్రహీం తమ్ముడు పాల్పడ్డారట. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి . మరి బాలీవుడ్ లో జరిగిన ఆ చీకటి కోణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
ఆమె ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అందాల తార మాధురి దీక్షిత్.. అందం, అభినయంతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె తన కెరియర్ లో 70కి పైగా హిందీ చిత్రాలలో నటించి భారీ స్టార్డంను సొంతం చేసుకుంది..ముఖ్యంగా నటనతోనే కాదు ఇటు అందంతో అటు నృత్య ప్రదర్శనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది మాధురి దీక్షిత్. అలాంటి ఈమెను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. అయితే ఆ అందమే ఈమె ప్రాణాలపైకి తీసుకొచ్చింది అనడంలో సందేహం లేదు. మాఫియా ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీం మాధురి దీక్షిత్ ను దుబాయ్ కి రమ్మని పిలిచారట. కానీ ఆమె నిరాకరించడంతో ఆమెను హత్య చేయడానికి ఒక ముఠాకి సుఫారీ కూడా ఇచ్చినట్లు సమాచారం.
అసలు విషయంలోకి వెళ్తే.. 1990 మధ్యకాలంలో మాధురి దీక్షిత్ తన కెరియర్లో పీక్స్ లో ఉన్న సమయంలోనే అనీస్ ఇబ్రహీం మాధురి దీక్షిత్ కి ఫోన్ చేసి .. కొంతకాలం దుబాయ్ కి వచ్చి నాతో గడుపు. ఆ తర్వాత వెళ్ళిపో అని ఆమెతో చెప్పాడట. అయితే అది ఆహ్వానం మాత్రమే కాదు బెదిరింపు కూడా.. ఆ రోజుల్లో దావూద్ గ్యాంగ్ పిలుపును తిరస్కరించడం అంటే ప్రాణాలతో ఆటాడడమే. అయితే మాధురి మాత్రం ధైర్యంగా వారి పిలుపును తిరస్కరించింది. అనీస్ బతిమాలాడు.. బెదిరించాడు.. కానీ ఆమె లొంగలేదు. తాను నమ్ముకున్న విధానాలను , కుటుంబ గౌరవానికి కట్టుబడి అతడి దగ్గరకు వెళ్లడానికి నిరాకరించింది. కానీ ఆ నిర్ణయమే ఆమె ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. దీంతో ఈమెను హత్య చేయాలని పూనుకున్న అనీస్ హంతకుల బృందాన్ని పంపించాడు.
ఆ ముఠా ముంబైలో దిగినట్లు సీనియర్ పోలీస్ ఆఫీసర్ జితేంద్ర దీక్షిత్ గుర్తించి.. వెంటనే మాధురితో “నీ ప్రాణాలకు ప్రమాదం ఉంది.. కొన్నాళ్లు విదేశాలకు వెళ్ళిపో.. ఇండియాకి రావద్దు” అని సూచించారట. అయితే ఆ సమయంలో బాలీవుడ్ సినిమాలు, షూటింగులు కూడా ఎక్కువగా విదేశాల్లోనే జరిగేవి. యూరప్ , దుబాయ్ వంటి చోట్ల అవుట్డోర్ షూటింగ్స్ నిర్వహించడం సాధారణ.. కానీ మాధురి విషయంలో ఆ పరిస్థితి భిన్నంగా ఉంది. దావూద్ గ్యాంగ్ చేరుకోలేని, అంతర్జాతీయ చట్టపరమైన రక్షణ ఉన్న యూరప్ దేశాలలో మాత్రమే ఆమె సినిమా షూటింగ్లను జరిపేవారు. ఇక దావూద్ ఇబ్రహీం సోదరుడికి భయపడి ఆమె దాదాపు నాలుగేళ్లపాటు ఇండియాకి దూరంగా విదేశాలలోనే గడిపింది. ఇక 1993 మార్చిలో జరిగిన ముంబై సిరీస్ బాంబు పేలుళ్ల తర్వాత ఆ పరిస్థితి మారిపోయింది.
ALSO READ:విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కు మాతృవియోగం!
పోలీసులు దావూద్ ఇబ్రహీం కుటుంబం, అతడి గ్యాంగ్ పై పట్టు బిగించారు. దాంతో వారి శక్తి తగ్గిపోయింది . ఇక మాఫియా బెదిరింపులు కూడా తగ్గాయి.. ఈ పరిణామాల తర్వాతనే మాధురి దీక్షిత్ మళ్లీ ఇండియాకు ధైర్యంగా రాగలిగింది. ఏదేమైనా మాధురి దీక్షిత్ జీవితంలో ఇంత విషాదం ఉందని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.