BigTV English

RRR + Khaleja : ట్రిపుల్ ఆర్ సినిమాలో మహేష్ బాబు ఉంటే? ఏమి తాగి ఎడిట్ చేశావు భయ్యా?

RRR + Khaleja : ట్రిపుల్ ఆర్ సినిమాలో మహేష్ బాబు ఉంటే? ఏమి తాగి ఎడిట్ చేశావు భయ్యా?

RRR + Khaleja : ఈ మధ్యకాలంలో టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఎంత డెవలప్ అయిందంటే ప్రేక్షకులు కోరికలు అన్నీ కూడా తీర్చేసేంత. ఒక దర్శకుడు ఒక హీరో కాంబినేషన్లో సినిమా చూడాలి అని కల చాలామందికి ఉంటుంది. కానీ ఆ దర్శకులు ఆ హీరోలతో సినిమా చేయరు. అది కొంచెం డిసప్పాయింటింగ్ గా ఉంటుంది. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే ఎంత బాగుంటుందో అని కొంతమంది ఊహిస్తారు. అయితే ప్రస్తుత కాలంలో ఆ ఊహలను నిజం చేసే పనిలో పడ్డారు కొంతమంది టాలెంటెడ్ పీపుల్. సోషల్ మీడియా వచ్చిన తర్వాత విపరీతమైన టాలెంట్ బయటకు వస్తుంది. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కష్టపడి పేరు సాధించడం అనేది మామూలు విషయం కాదు. కానీ ఇప్పుడు అలా మంచి పేరు సాధించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కేవలం సోషల్ మీడియా వేదికగా తమ టాలెంట్ చూపించి ఎంతో మంది ఫేమస్ అయ్యారు.


ఏమి తాగి ఎడిట్ చేశాడో…

సోషల్ మీడియాలో మనల్ని ఆశ్చర్యపరిచే ఎడిట్ వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి. పవన్ కళ్యాణ్ మహేష్ బాబు కలిసి సినిమా చేయకపోయినా కూడా వారిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించారా అనే రేంజ్ లో కొన్ని వీడియోస్ ఎడిటింగ్ చేస్తారు. ఎస్.ఎస్ రాజమౌళి మహేష్ బాబు ప్రస్తుతం సినిమా చేస్తున్నారు. కానీ ఇంతకుముందు మీరు ఎప్పుడూ కలిసి పని చేయలేదు. అదే త్రిబుల్ ఆర్ సినిమాలో మహేష్ బాబు ఉండి ఉంటే ఎలా ఉంటుంది అని ఒక నెటిజన్ వీడియో చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. బహుశా ఈ థాట్ రాజమౌళికి కూడా వచ్చి ఉండకపోవచ్చు. మహేష్ బాబు ఖలేజా సినిమాలోని కొన్ని డైలాగ్స్ ను త్రిబుల్ ఆర్ సినిమాలు ఇంక్లూడ్ చేసి ఆ వీడియోని ఎడిట్ చేశాడు. కంప్లీట్ వైరల్ గా మారిన ఆ వీడియో కింద చాలామంది ఎడిటర్ ను పొగుడుతూ కామెంట్స్ పెడుతున్నారు. మనం కూడా చూసినప్పుడు అసలు ఏమి తాగి ఎడిట్ చేశాడు అని అనక తప్పదు.


ఇది ఒక ట్రెండ్ అయిపోయింది

మామూలుగా కొన్నిసార్లు కొన్ని ఫ్రెండ్స్ నడుస్తూ ఉంటాయి. విక్టరీ వెంకటేష్ నువ్వు నాకు నచ్చావు సినిమాలోని కలెక్టర్ అవుతాను అని చెప్పే మాటలను సీరియస్ గా తీసుకొని ఒకవేళ వెంకటేశ్వర్లు కలెక్టరైతే ఎలా ఉంటుందో అనే ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ వీడియో కూడా వైరల్ గా మారింది. సుకుమార్ మహేష్ బాబు కాంబినేషన్లో రావాల్సిన సినిమా క్యాన్సిల్ అయిపోయిన విషయం తెలిసిందే. ఒకవేళ పుష్ప సినిమాను మహేష్ బాబు చేసి ఉంటే ఎలా ఉంటుందో అని ఒక ఎడిట్ చేశారు. ఆ ఎడిట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో మహేష్ బాబు ఉంటే ఎలా ఉంటుంది. అనే వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంకా ముందు ముందు ఎలాంటి వీడియోలు వస్తాయో అనే క్యూరియాసిటీ చాలామందిలో మొదలైంది.

?igsh=end3dmJzOGJ5dDV2

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×