BigTV English

Manchu Vishnu: ప్రభాస్ ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు

Manchu Vishnu: ప్రభాస్ ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు

Manchu Vishnu: మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా కన్నప్ప. మంచు ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలను ప్రేక్షకులు చూడటం పక్కన పెట్టేసిన సంగతి మనకు తెలిసిందే. ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపించిన ఇది నిజమే. ఎందుకంటే మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ మొత్తంలో కనీసం వందమంది కూడా ఈ సినిమాని చూడలేదు అనేది వాస్తవం. అలానే మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా కూడా పలుచోట్ల షోస్ క్యాన్సిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆడియన్స్ థియేటర్ కు రావడం తగ్గించేశారు. ఒక స్టార్ హీరో సినిమా విడుదల అయితే కానీ థియేటర్ కు రాని పరిస్థితి. ఇక ప్రస్తుతం ఈ ఫ్యామిలీ నిర్మిస్తున్న కన్నప్ప సినిమా మీద కొద్దిపాటి అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం పలువురు స్టార్స్ ఈ సినిమాలో నటించడం. ఈ విషయం అందరికీ తెలిసిందే.


రుద్ర పాత్రలో ప్రభాస్

ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి మంచి అంచనాల పెరగడానికి ముఖ్య కారణం ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ కు వెళ్ళిపోయిందో అందరికీ తెలిసిన విషయమే. ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఈ సినిమాలో రుద్ర అనే పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నాడు. విడుదల చేసిన ట్రైలర్ లో కూడా ప్రభాస్ కు సంబంధించిన కొన్ని షాట్స్ చూపించారు. ఈ విషయంపై మంచు విష్ణు మాట్లాడారు.


ప్రభాస్ ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు

స్నేహంలో కృష్ణుడిగా, కర్ణుడిగా రెండు రకాలుంటాయి. నా జీవితంలో కృష్ణుడిగా ప్రభాస్ ఉంటారు. అసలు ఈ చిత్రాన్ని చేయాల్సిన అవసరం ప్రభాస్‌కి లేదు. నాన్న గారి మీదున్న గౌరవంతోనే ప్రభాస్ ఈ మూవీని చేశారు. స్టార్‌గా కంటే.. ప్రభాస్ మానవత్వం ఇంకెంతో గొప్పగా ఉంటుంది. కొంత డబ్బు, పేరు వచ్చినా అంతా మారిపోతారు. కానీ ప్రభాస్ మాత్రం ఇంకా అలానే ఒదిగి ఉంటారు. నాకు ప్రభాస్ కృష్ణుడు అయితే.. నేను మాత్రం ప్రభాస్‌కి కర్ణుడిని. ఆయనకు ఎప్పుడూ, ఎల్లప్పుడూ సపోర్ట్‌గానే ఉంటాను. ప్రస్తుతం మంచు విష్ణు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమా మీద కొద్దిపాటి పాజిటివ్ రెస్పాన్స్ కూడా మొదలైంది. వీటన్నిటిని మించి ముఖ్యంగా ట్రైలర్ మాత్రం ఆసక్తికరంగానే అనిపించింది. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికైనా ఆదరిస్తారు అని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయ్యే అవకాశం ఉంది.

Also Read : ఇండస్ట్రీలో ఘోర విషాదం… నిద్రలోనే స్టార్ హీరో మృతి

Related News

War 2: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బ్రేక్!

Allu Arjun: అల్లుఅర్జున్‌కు అధికారుల షాక్.. నేనొక ఫేమస్ నటుడ్ని, అయినా వినలేదు

Film industry: కాల్పుల్లో ప్రముఖ రాపర్ సింగర్ మృతి!

Coolie Vs War 2: రాజకీయ చిచ్చు లేపిన లోకేష్.. ఎన్టీఆర్ ను దెబ్బతీయడానికేనా?

War 2: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం.. కానీ ఆంక్షలు తప్పనిసరి!

Mahavatar Narasimha Collections : నరసింహుడి ఉగ్రతాండవం ఇప్పటిల్లో తగ్గేట్టులేదే.. 200 కోట్ల రాబడుతుందా..?

Big Stories

×