Kannappa Pre Release Event: మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మీద అంచనాలు ఉండడానికి కారణం మంచు ఫ్యామిలీ కాదు. వాళ్లు ఈ సినిమా కోసం ఎంచుకున్న మంచి నటులు. ఈ ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలు దాదాపు చూడటం మానేశారు కాబట్టి. మిగతా ఇండస్ట్రీలో మంచి పేరున్న నటులను తీసుకొచ్చి ఈ సినిమాలో పెట్టారు. ఇది సినిమా సక్సెస్ కోసం వేసిన మాస్టర్ ప్లాన్ అని చెప్పాలి. అలానే ఈ సినిమాను న్యూజిలాండ్ లో తెరకెక్కించారు. దాదాపు అడవుల్లో జరిగే కథ కాబట్టి పెద్దగా అప్పటికి ఇప్పటికీ న్యూజిలాండ్ లో మార్పులు లేవు. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్.
ఎప్పటిలాగే సొంత డబ్బా
మంచు ఫ్యామిలీ అంటేనే తమ గురించి తాము గొప్పలు చెప్పుకుంటారు అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టేజ్ ఎక్కిన ప్రతిసారి వాళ్లేదో ఆకాశం నుంచి ఊడి పడినట్లు చెబుతూనే ఉంటారు. అందువలనే ప్రేక్షకులకు ఈ ఫ్యామిలీ అంటేనే విసుగు కలిగింది. ఇప్పుడు మరోసారి వాళ్ళ ధోరణి బయటపడింది. ఎప్పటిలానే డబ్బా కొట్టడం మొదలుపెట్టారు. విష్ణు మంచు మాట్లాడుతూ “నాకు మోహన్ బాబు గారు దేవుడు. ప్రభు దేవా గారు మాకోసం మూడు పాటల్ని చేశారు”
బ్రహ్మానందం మాట్లాడుతూ
డబ్బు కోసం మోహన్ బాబు గారు ఈ మూవీని తీయలేదు. అందరినీ ఒకేలా చూసే ఆ శివుడి గురించి ప్రపంచానికి చెప్పేందుకు మోహన్ బాబు గారు, విష్ణు బాబు ఈ మూవీని ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ మూవీని ఎవ్వరూ అడ్డుకోకండి. ఇదొక గొప్ప చిత్రం అవుతుంది. కన్నప్ప ఒక చరిత్ర అవుతుంది.
శరత్ కుమార్ మాట్లాడుతూ
మోహన్ బాబు నాకు పెద్దన్నయ్యలాంటి వారు. విష్ణు నాకు పుత్రసమానుడు. ‘కన్నప్ప’ గురించి నేను చెప్పడం కాదు.. జూన్ 27న ఆడియెన్స్ అందరికీ తెలుస్తుంది. ఈ మూవీని తీయమని ఆ శివుడే ఈ మోహన్ బాబు గారికి చెప్పి ఉంటారు. ఆయన అనుగ్రహం వల్లే మేం అంతా ఈ చిత్రానికి వచ్చినట్టు అనిపిస్తుంది. శివాజ్ఞతోనే ఈ చిత్రం ఇక్కడి వరకు వచ్చింది’ అని అన్నారు.
మధుబాల మాట్లాడుతూ
నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మోహన్ బాబు గారికి, విష్ణు గారికి థాంక్స్. 90వ దశకంలో నేను మోహన్ బాబు గారితో కలిసి నటించలేకపోయాను. ఇప్పుడు మోహన్ బాబు గారు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి వారితో నటించడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.
తోట ప్రసాద్ మాట్లాడుతూ
మోహన్ బాబు గారితో పని చేయడంతో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. కన్నప్పలో భక్తి, లీల ఉంటుంది. ఇంత వరకు ఎంతో మంది మహామహులు కన్నప్ప పాత్రను పోషించారు. ఇక రాబోయే తరానికి విష్ణు ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు’ అని అన్నారు.
మోహన్ బాబుని పొగడడం మాత్రమే కాకుండా సినిమా గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు పలువురు పంచుకున్నారు. కానీ ఈవెంట్ లో మంచు ఫ్యామిలీ ప్రస్తావన ఎక్కువగా రావడం వలనే డబ్బా కొట్టించుకున్నారు అనే కామెంట్స్ సోషల్ మీడియాలో మొదలయ్యాయి.
Also Read : Kannappa Pre Release Event : ప్రభాస్ ఎంట్రీతోనే అసలు సినిమా… డార్లింగ్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ ఇది