Upasana: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న కుటుంబాలలో మెగా కుటుంబం కూడా ఒకటి. ముఖ్యంగా ఈ కుటుంబం నుండి చాలామంది హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక అలా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వారసుడిగా, గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు రామ్ చరణ్ (Ram Charan). ఇదిలా ఉండగా రామ్ చరణ్.. ఉపాసన (Upasana) ను వివాహం చేసుకున్న తర్వాత.. పదేళ్లకు కూతురు జన్మించిన విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ కూతురి ముఖాన్ని నేరుగా చూడడానికి అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్న విషయం కూడా తెలిసిందే. కానీ ఇప్పటివరకు వీరు మాత్రం తమ కూతురి ముఖాన్ని నేరుగా చూపించలేదు. ఇక పాప ఎలా ఉంది? ఏం చేస్తోంది? ఏం తింటుంది? ఇలా అన్ని విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.
క్లీంకారా ఫేవరెట్ ఫుడ్ అదే – ఉపాసన
అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఉపాసన ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో భాగంగానే తన కూతురు క్లీంకారా ముఖాన్ని చూపించకపోయినా.. పాప ఏం తింటుంది అనే విషయాలను చెప్పుకొచ్చింది. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ చీఫ్ తో కలసి లంచ్ చేసి, హోమ్ టూర్ కూడా నిర్వహించిన ఉపాసన.. తన ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు పంచుకుంది. ఈ క్రమంలోనే ఉపాసన మాట్లాడుతూ.. “నా ఫేవరెట్ ఫుడ్ రాగి సంగటి , మటన్ పులుసు.. నా కూతురికి కూడా రోజు రాగి పెడతాను. ముఖ్యంగా రాగి ఫుడ్డు ఏ రూపంలో అయినా సరే తినిపించాలి అని సద్గురు నాతో చెప్పారు. అందుకే క్లీంకారా డైలీ రొటీన్ లో భాగంగా రాగి జావ తాగుతుంది. ఇష్టంగా తాగుతుంది. అది చాలా మంచిది. ఇక తనకు ఇష్టమైన ఆ రాగిజావ ఒక్కరోజు లేకపోయినా గోల చేస్తుంది అంటూ తన కూతురు గురించి చెప్పుకొచ్చింది. ఇక మొత్తానికి అయితే క్లీంకారా ఫుడ్ పై ఉపాసన చెప్పిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా పాప ముఖం చూడడానికి అభిమానులు చాలా ఎక్సైట్ గా ఎదురు చూస్తున్నారు. మరి ఈ లవ్లీ కపుల్స్ ఎప్పుడు తమ కూతురిని అందరికీ పరిచయం చేస్తారో చూడాలి.
స్పోర్ట్స్ హబ్ కో చైర్మన్ గా ఉపాసన..
ఉపాసన విషయానికి వస్తే.. ఒకవైపు అపోలో హాస్పిటల్స్ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరొకవైపు తెలంగాణలో కీలక పదవిని సొంతం చేసుకున్నారు. స్పోర్ట్స్ హబ్ కి ఈమె కో చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇంకొక వైపు కుటుంబ బాధ్యతలు చేపట్టిన ఉపాసన.. ఇలా అన్ని విషయాలను చక్కగా నిర్వర్తిస్తూ తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది.
రామ్ చరణ్ సినిమాలు..
రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈయన బుచ్చిబాబు సనా (Bucchibabu sana) దర్శకత్వంలో ‘పెద్ది’ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ (Janhvi kapoor) హీరోయిన్గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, సుకుమార్ డైరెక్షన్లో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also read: Nagarjuna: టబు, రమ్యకృష్ణ.. ఇద్దరిలో ఎవరు బెస్ట్.. నాగ్ అదిరిపోయే సమాధానం!