Mohan Babu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విలన్, హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు గురించి అందరికి తెలిసిందే. మొదటగా విలన్ గా పరిచయమైనా మోహన్ బాబు ఆ తర్వాత హీరోగా కూడా నటించి కొన్ని సినిమాలతోనే స్టార్ హీరో గా నిలిచాడు. హాస్య పరమైన సినిమాలలో, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.. ఇండస్ట్రీలో ఆయనను ముద్దుగా కలెక్షన్ కింగ్ అని పిలుస్తారు. మోహన్ బాబు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 50 ఏళ్లు పూర్తి కావొస్తుంది. ఈ సందర్బంగా ఆయన తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.. అందులో తన గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు..
డ్రిల్ మాస్టర్ గా మోహన్ బాబు..
ఈయన ఇంటర్వ్యూ మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి పరిచయం కాకముందు డ్రిల్ మాస్టర్ గా ఓ స్కూల్ లో జాయిన్ అయిన విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పుడు ఆయన సంపాదన 140 రూపాయలు అని.. అక్కడ ఓ ఏడాది పాటు పని చేశానని తెలిపాడు. ఇక స్కూల్ నిర్వహణలో ప్రధానంగా వ్యవహరించిన ఓ గ్రూపుకు చెందిన కులం వాడిని కాకపోవడంతో తనను ఉద్యోగం నుంచి తీసేసారని తెలిపాడు.. ఆ రోజుల్లో ఆయనకు ఆ జాబ్ ముఖ్యం. కానీ కేవలం కులం కోసం తనను తీసేయ్యడం బాధగా అనిపించిందని అన్నారు. కులం అనేది అడ్డంకి కాకూడదని భావించి తను స్థాపించిన విద్యానికేతన్ స్కూల్ మొదట్లోనే.. తన స్కూల్ అడ్మిషన్ ఫామ్ లో కులం అనే కాలమ్ తీసేశాడట.. ఇండియాలోనే కులం కాలం తీసేసిన మొదటి వ్యక్తి ఈయనే కావడం విశేషం.. సినిమాలలో వేషాలు అడుక్కోవడానికి నిర్మాతలు, దర్శకుల దగ్గరికి వెళ్ళినప్పుడు తనను.. నువ్వు రాయలసీమ వాడివి కదా.. నీకు భాష ఏం తెలుసు అని అన్నారట. ఎన్టీఆర్ సినిమాలు చూసి భాషను నేర్చుకున్నట్లు చెప్పాడు..
మోహన్ బాబు సినిమాలు..
మోహన్ బాబు చాలా ఉదారమైన మనిషి.. సినిమాల్లో నటించాలనే కోరికతో ఇటుగా అడుగులు వేశారు. ఎన్నో అవమానాలను దిగమింగుకొని నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు. మొదట విలన్. ఆ తర్వాత ఆయన నటనకు ఫిదా అయిన నిర్మాతలు ఈయన తో అసెంబ్లీ రౌడీ మూవీని తీశారు. తొలిసారిగా హీరోగా నటించాడు మోహన్ బాబు. ఈ సినిమా తనకు మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో.. ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు. మొత్తం 150కి పైగా సినిమాలలో హీరోగా, 400 సినిమాలకు పైగా విలన్ గా నటించాడు. ఇక నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాడు.. రీసెంట్ గా ఈయన నిర్మాణ సంస్థ నుంచి కన్నప్ప వచ్చింది. బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది.
Also Read : మరో మాస్టర్ తో శ్రేష్ఠ వర్మ.. ఇదేం ట్విస్ట్ తల్లి..
రెండు పెగ్గులు వెయ్యడం అలవాటు..
మోహన్ బాబు ఈ ఇంటర్వ్యూలో పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. ప్రతి రోజు ఆయనకు రెండు పెగ్గులు వేసుకొనే అలవాటు ఉందని బయట పెట్టారు. అలా ఆయన అలవాట్లను నిర్మొహమాటంగా చెప్పడంతో ఫిదా అవుతున్నారు. ఈరోజుల్లో ఇలా ఎవ్వరు ఉండరు. తమకున్న అలవాటులను దాచిపెడతారు. మోహన్ బాబు ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు..