Prakash Raj: సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల మధ్య సాన్నిహిత్యం, విభేదం.. ఎప్పుడు? ఎలా? ఎక్కడ? మొదలవుతాయో చెప్పడం కష్టం.. ఈరోజు ఒకరికొకరు హగ్ చేసుకున్న సెలబ్రిటీలు.. మరుసటి రోజు నువ్వెవరో నేనెవరో అన్నట్టు వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలోనే మొన్నటి వరకు మెగా ఫ్యామిలీతో సన్నిహితంగా ఉన్న ప్రకాష్ రాజ్ (Prakash Raj).. నేడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై విమర్శిస్తూ.. చేస్తున్న కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో మా ఎలక్షన్స్ జరిగిన సమయంలో ప్రకాష్ రాజ్ కి మెగా కుటుంబం ఎంత అండగా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రకాష్ రాజ్ మాత్రం ఇప్పుడు అదే మెగా ఫ్యామిలీ పై విమర్శనాస్త్రాలు గుప్పించడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి. మరి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పిరికిపంద అంటూ ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.
అధికారం ఇచ్చిన అహంకారం – ప్రకాష్ రాజ్
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రకాష్ రాజ్.. ఆంధ్రప్రదేశ్ డీసీఎం పవన్ కళ్యాణ్ పై, ఆయన మాట తీరుపై మండిపడ్డారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. “వైసీపీ వాళ్ల తాటతీస్తా.. మక్కి విరగ్గొడతా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది సినిమా కాదు కదా.. నిజజీవితంలో మనం ఒక మాట మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి అడుగులు వేయాలి పవర్ లేనప్పుడు కూడా ఆయన ఇలాగే మాట్లాడాడు. ఇక పవర్ వచ్చిన తర్వాత కూడా ఇలాగే మాట్లాడితే ఆ పదవి ఇచ్చిన అహంకారంతోనే అలా మాట్లాడుతున్నారని అందరికీ అర్థమవుతుంది. గన్ను గురిపెట్టి కాల్చేస్తాను అంటే అది నీ పిరికితనానికి ఎక్స్టెన్షన్ మాత్రమే. పిరికి వాళ్ళు మాత్రమే ఇలా చంపుతా.. నరుకుతా.. అంటూ చెబుతారు.ధైర్యంగా ముందుకు అడుగు వేసేవారు ఇలాంటి మాటలు మాట్లాడరు అంటూ తెలిపారు.
పవన్ కళ్యాణ్ ఒక పిరికిపంద – ప్రకాష్ రాజ్
“అధికారం అనేది ప్రజలకు సహాయం చేయడానికి ఉపయోగించాలి కానీ ఎదుటివారిని చంపేస్తాం, నరికేస్తామని భయపెట్టడానికి కాదు. ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు అంటే వారిని కాపాడడానికి నీ అధికారం ఉపయోగించాలి కానీ ఇలా మాటలతో దిగజారి పోవడం కాదు.. ఇక వైసిపి వాళ్లకు మీకీ ఓటింగ్ ఎంత అని అంటున్నారు కదా.. బీజేపీకి మీకు ఓటింగ్ ఎంత? కాపులు కనక లేకపోతే అసలు మీరు అధికారంలోకి వచ్చేవారా.. కాపులు లేకపోతే మీ బ్రతుకు ఎక్కడ.. పవన్ కళ్యాణ్ ఒక పిరికిపంద” అంటూ పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్లు చేశారు ప్రకాష్ రాజ్. ఇక ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం..
తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ‘ప్రజారాజ్యం పార్టీ’ ని స్థాపించారు. ఇక అక్కడితో మొదలైన ఆయన రాజకీయ ప్రయాణం 10 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతూనే వచ్చింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేయడంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి.. అధికారం కోసం ఆయన ఎన్ని తిప్పలు పడ్డారో ప్రతి ఒక్కరూ స్పష్టంగా చూసిన విషయం తెలిసిందే. ఇక గత ఏడాది కూటమి ప్రభుత్వంతో పొత్తు పెట్టుకొని పిఠాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందారు. పదేళ్ల తన కలను సహకారం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు చాలామందికి అండగా నిలుస్తూ ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
ALSO READ:Samantha: నెటిజన్స్ కి సమంత స్ట్రాంగ్ ఛాలెంజ్.. భరించలేకపోతున్నా అంటూ!
పవన్ కళ్యాణ్ ఒక పిరికి పంద…
నీ ఓటింగ్ శాతం ఎంత వైసీపీ ఓటింగ్ శాతం ఎంత ? ఏదో కాపులు ఓట్లు చూసుకొని బలుపుతో మాట్లాడుతున్నావు .. కొంచెం తగ్గు…
:- ప్రకాష్ రాజ్ గారు@PawanKalyan pic.twitter.com/UByxOQlYVH— Manchiga Undu (@Manchiga_Undu) June 28, 2025