Shresta Verma : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లిన విషయం అందరికి తెలిసిందే.. తన అసిస్టెంట్ లైంగిక వేధింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే.. అయితే ఇన్నాళ్లు ఆమె ఫేస్ ఎక్కడ కనిపించకుండా కేవలం ఆమె పెట్టిన కేసు ఆధారంగా మాస్టర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఆ తర్వాత ఈ కేసు రోజుకో మలుపు తిరిగింది.. మొత్తానికి ఈ కేసులో నుంచి మాస్టర్ బయట పడ్డాడు. ప్రస్తుతం మాస్టరు వరుస సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తూ బిజీగా ఉన్నారు. ఆయనపై కేసు పెట్టిన శ్రేష్ఠ వర్మ కూడా పలు సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఈమె ఈమధ్య కొన్ని చానల్స్ కి ఇంటర్వ్యూ లిస్టు జానీ మాస్టర్ గురించి ఎన్నో విషయాలను బయటపెట్టింది. అయితే తాజాగా శ్రేష్టవర్మ తన సోషల్ మీడియా వేదికగా మరో మాస్టర్ గురించి రాసుకొచ్చింది.. అది హాట్ టాపిక్ గా మారింది.
శ్రేష్ఠ వర్మపై నెటిజన్స్ ట్రోల్స్..
జానీ మాస్టర్ ని జైలుకు పంపించి మరి తన కక్ష సాధించుకుంది శ్రేష్ఠ వర్మ.. ఇది ఆయన అభిమానులంటున్న మాట. ఎన్ని విధాలుగా తనని ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిన కూడా మాస్టరు గోడ గొట్టిన బంతిలాగా తిరిగి మళ్ళీ కెరీర్ ను బిజీగా మార్చుకున్నాడు. శ్రేష్ట వర్మ కూడా కొరియోగ్రాఫర్ గా కొన్ని సినిమాలను చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఈమె తన ఇంస్టాగ్రామ్ లో మరో మాస్టర్ గురించి పొగుడుతూ ఒక పోస్ట్ చేసింది.. ఆ పోస్ట్ లో ప్రస్తుతం శ్రేష్టి వర్మ.. నాగబంధనం సినిమాలో ఒక సాంగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సాంగ్ ఫినిష్ అవ్వడంతో తనకు అవకాశం ఇచ్చిన మూవీ మేకర్స్ కు , అలాగే సాంగ్ చేసిన గణేష్ ఆచార్య మాస్టర్ కు శ్రేష్టి వర్మ థ్యాంక్స్ చెప్తూ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది.. ఆ మూవీలోని సాంగ్ ను పూర్తి చేసాము. ఈ సాంగ్ కు కోరియోగ్రాఫర్ అయిన గణేష్ ఆచార్య మాస్టర్ కు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను మాస్టర్. మీ మార్గదర్శకత్వం, మీ ఓర్పు నాపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. మీరు నేర్పే విధానం, మీరు పంచె జ్ఞానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. మీరు నాకు గొప్ప అవకాశాన్నిచ్చిన దేవుడు లాంటి వారు అంటూ పొగడ్తల వర్షం కురిపించింది. ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఆమెపై అటు జానీ మాస్టర్ అభిమానులు.. నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మాస్టర్లని ముందుగా పొగడడం, ఆ తర్వాత నన్ను వేధించాడు అంటూ కేసులు పెట్టడం నీకే సాధ్యం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..
Also Read :కంటెస్టెంట్స్ కు బిగ్ షాక్.. హౌస్ లో ఉండాలంటే ఆ రూల్స్ పాటించాల్సిందే..!
శ్రేష్ఠ వర్మ కొరియోగ్రఫీ చేసిన సినిమాలు..
జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా ఉంటూ పలు సినిమాలకు పని చేసింది.. ఆయనపై ఆమె లైంగిక కేసులు పెట్టిన తర్వాత సొంతంగా సినిమా అవకాశాలను అందుకుంటూ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతుంది. పుష్ప 2 సినిమాలోని సూసేకి అగ్గిరవ్వ మాదిరి సాంగ్ కు కొరియోగ్రఫీ చేసింది శ్రేష్టి వర్మనే. ఈ సాంగ్ కు మంచి గుర్తింపు రావడంతో పాటు శ్రేష్టి వర్మను సుకుమార్ తెగ మెచ్చుకున్నాడు.. ఈ మూవీ తర్వాత ఆమె లైఫ్ పూర్తిగా మారిపోయింది. వరుస అవకాశాలతో బిజీగా మారింది. తెలుగు తో పాటు వేరే ఇండస్ట్రీలలో కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయని సమాచారం.