Mohan Lal – Mammootty: హీరో అంటే.. ఎలా ఉండాలి. వంద మంది విలన్స్ వచ్చినా ఫైట్ చేయాలి. ఎంతమంది అమ్మాయిలతోనైనా రొమాన్స్ చేయాలి. ఎమోషన్స్ పండించాలి. డ్యాన్స్ చేయాలి. హీరో అంటే ఇలానే ఉండాలి. కానీ, అందరూ హీరోలు వేరు.. మలయాళ హీరోలు వేరు. అంటే ఏంటి.. ఆ హీరోల్లా వేరే హీరోలు చేయలేరనా..? అంతా గొప్ప ఏముంది.. వారిలో..? అసలు ఆ హీరోలు ఎవరు..? వాళ్ల స్పెషల్ ఏంటి అనేది తెలుసుకుందాం.
మలయాళ స్టార్ హీరోలు మోహన్ లాల్, మమ్ముట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మమ్ముట్టి.. తెలుగులో పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. పాత్ర ఏదైనా కానీ, ఆయన దిగనంత వరకే. ఒకసారి ఆయన పాత్రలో రంగప్రవేశం చేశాడా.. ? అవార్డులు అలా నడుచుకుంటూ వస్తాయి. అయితే హీరో అంటే ఇలానే ఉండాలి అనే మూస పద్ధతిని మమ్ముట్టి పక్కన పెట్టాడు. కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నాడు.
ఒక స్టార్ హీరో.. అమ్మాయి డ్రెస్ వేసుకుంటేనే ఫ్యాన్స్ ఒప్పుకోరు. అసలు ఆ హీరో సైతం నేనేంటి.. నా స్థాయి ఏంటి.. నేను అమ్మాయి పాత్రలో కనిపిస్తే నా పరువు ఏం కావాలి అని అంటారు. అలాంటిది ఒక స్టార్ హీరో అయ్యి ఉండి ఏకంగా గే పాత్రలో నటించాడు మమ్ముట్టి. ఇది అస్సలు ఎవరు ఊహించలేదు. కాథల్ కోర్ సినిమాలో మమ్ముట్టి ఒక అబ్బాయికి ఆకర్షితుడయ్యే పాత్రలో కనిపించాడు. జియో బేబీ దర్శకత్వ వహించిన ఈ సినిమా 2023 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అసల్ మమ్ముట్టి ఇలాంటి ఒక పాత్రలో నటిస్తాడు అని ఎవరు ఊహించలేదు. ఇప్పటివరకు ఏ స్టార్ హీరో కదా ఇలాంటి పాత్రలో కనిపించలేదు.
సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు.. అది రెండేళ్ల క్రితం సినిమా గురించి ఇప్పుడెందుకు మాట్లాడుకోవడం అంటే.. తాజాగా మమ్ముట్టి లానే .. మరో స్టార్ హీరో మోహన్ లాల్ కూడా ఇదే సాహసం చేశాడు కాబట్టి. అవును.. తాజాగా మోహన్ లాల్ ఒక జ్యూవెలరీ యాడ్ లో కనిపించాడు. ఈ యాడ్ లో ఒక హీరోగా.. జ్యూవెలరీ యాడ్ లో కనిపించడానికి వస్తాడు. అక్కడ అమ్మాయిలు వేసుకున్న జ్యూవెలరీ చూసి మోహన్ లాల్ కూడా వేసుకోవాలని చూస్తుంటాడు. ఎవరు చూడకుండా ఆ జ్యూవెలరీని దొంగతనం చేసి.. కార్ వాన్ లోకి వెళ్లి.. ఒంటిమీద జ్యూవెలరీ వేసుకొని.. అచ్చు ఆడవారు ఎలా ఫీల్ అవుతారో.. అలానే హొయలు పోయాడు. చేతులు, కాళ్లు వయ్యారంగా ఊపుతూ అమ్మాయిలా మారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియో పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా ఏ స్టార్ హీరో అయినా చేయగలడా.. ? కానీ, మోహన్ లాల్ చేశాడు అంటే అందరూ షాక్ అవుతున్నారు. ఇప్పటికే మమ్ముట్టి ఇలా కనిపించి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు మోహన్ లాల్ కూడా ఎవరు ఏమంటారు.. నా స్టేటస్ ఏంటి.. నా రేంజ్ ఏంటి అనేది చూడకుండా ఇలాంటి బోల్డ్ అటెంప్ట్ చేసి ఔరా అనిపించాడు. ఇక ఈ స్టార్ హీరోలు చేసిన రిస్క్ చూసి.. ఈ ఇద్దరు హీరోల్లా ఏ హీరోకైనా చేసే దమ్ము ఎవరికైనా ఉందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.