The Girl friend: ప్రముఖ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈమె.. తాజాగా విడుదలకు సిద్ధంగా ఉంచిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. ప్రముఖ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) రూపొందించిన ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ లో రష్మిక మందన్న – దీక్షిత్ శెట్టి (Deekshith Shetty) జంటగా నటిస్తున్నారు.
నవంబర్ 7వ తేదీన హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ చిత్రంలోని ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ డేట్ ను మేకర్స్ తాజాగా గ్లింప్స్ తో సహా అనౌన్స్ చేశారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఈనెల 25వ తేదీన ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన గ్లింప్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మరొకవైపు వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. ఇటీవలే “నేను సింగిల్ కాదు.. మంచి గర్ల్ ఫ్రెండ్” ను అంటూ చెప్పి రిలేషన్ లో ఉన్న విషయాన్ని బయటకు చెప్పేసింది. ప్రస్తుతం రష్మికకు సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఛలో సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె… ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది. ముఖ్యంగా గత మూడు సంవత్సరాలుగా పుష్ప, పుష్ప 2, ఛావా, యానిమల్, కుబేర అంటూ వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన ఈమె.. హిందీలో ‘సికందర్’ సినిమా చేసి కాస్త డిజాస్టర్ ను మూటగట్టుకుంది. అయితే ఈ సినిమా డిజాస్టర్ రష్మికపై ఏ మాత్రం ప్రభావం చూపలేదు అనడంలో సందేహం లేదు. మరొకవైపు మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం థామా.. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో బేతాళ జాతికి చెందిన అమ్మాయి పాత్రలో రష్మిక ఒదిగిపోయిందని చెప్పవచ్చు.
ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. రెండు వారాల వ్యవధిలోనే రెండు చిత్రాలను విడుదలకు సిద్ధం చేసింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న రష్మిక ఈ రెండవ చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విషయానికి వస్తే… ఈ సినిమాని గీత ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక అల్లు అరవింద్ కూడా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
also read:Bigg Boss 9 Promo: హౌస్ లోకి పోలీసులు.. అసలేం జరుగుతోంది?