Music director Death:చిత్ర పరిశ్రమలో సినీ సెలబ్రిటీల మరణాలు వారి కుటుంబ సభ్యులనే కాదు అభిమానులను కూడా తీవ్ర దుఃఖంలోకి నెట్టివేస్తున్నాయి. ఈ ఏడాది ఏ ముహూర్తాన మొదలైందో తెలియదు కానీ.. వరుసగా సినీ సెలబ్రిటీల మరణాలు అందరినీ అతలాకుతలం చేస్తున్నాయి అంటూ నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకూ .. అటు ఏకంగా హాలీవుడ్ వరకు చాలామంది సెలబ్రిటీలు స్వర్గస్తులవుతున్నారు. ముఖ్యంగా చిన్న వయసులోనే కొంతమంది అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిస్తే..మరి కొంతమంది వృద్ధాప్య కారణాలవల్ల స్వర్గస్తులవుతున్నారు. ఇంకొంతమంది ఇతరులకు సహాయపడడం కోసం వెళ్లి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇదిలా ఉండగా ఇప్పుడు ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.. ఆయన ఎవరో కాదు ప్రముఖ సంగీత దర్శకులు సబేష్ (Sabhesh). కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఈయన గురువారం ఉదయం కన్ను మూసినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈయన మరణంతో కోలీవుడ్ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఈ విషయం తెలుసుకున్న సినీ పరిశ్రమ, అభిమానులు, సెలబ్రిటీలు ఆయన మరణానికి సంతాపం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉండడం గమనార్హం.
సబేష్ ఎవరో కాదు సంగీత దర్శకుడు దేవా సొంత సోదరుడు.. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో చిత్రాలకు సంగీతాన్ని అందించడం జరిగింది. సబేష్ గాయకుడిగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇకపోతే వీరి మరో సోదరుడు మురళీ కూడా సంగీత దర్శకుడు కావడం విశేషం. ముఖ్యంగా సేబేష్ , మురళీ జంట సంగీత దర్శకులుగా మంచి పేరు సొంతం చేసుకుంది.. వీరిద్దరూ సినిమాలలోనే కాకుండా ఎన్నో పేరు పొందిన ప్రైవేటు ఆల్బమ్స్ కూడా రూపొందించారు. ఇక సబేష్ కుమారుడు కార్తీక్ హాస్యనటుడిగా తమిళ్ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండడం గమనార్హం.
2001లో వచ్చిన సముతిరం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయమయ్యారు సబేష్. నైనా , ఆయిరం పోయి సోల్లి, బాల్ , పారై, అయోధ్య, గురుదేవా ఇలా ఎన్నో చిత్రాలకు సంగీతాన్ని అందించి మంచి పేరు సొంతం చేసుకున్నారు. వీటితోపాటు పదుల సంఖ్యలో చిత్రాలకు సంగీతం అందించిన ఈయన.. ఇలా అనారోగ్యంతో కన్నుమూశారని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అటు నెటిజన్స్ కూడా ఆయన మరణానికి సంతాపం తెలియజేస్తున్నారు.
ALSO READ:SKN: బండ్లన్న అలా చేస్తే ఇండస్ట్రీకి ప్రమాదం… నిర్మాత SKN షాకింగ్ కామెంట్!