E-Paper
Advertisement

తండేల్ ఇచ్చిన ధైర్యం.. భారీ స్థాయిలో వృషకర్మకు నాన్ థియేట్రికల్ బిజినెస్!

తండేల్ ఇచ్చిన ధైర్యం.. భారీ స్థాయిలో వృషకర్మకు నాన్ థియేట్రికల్ బిజినెస్!
Advertisement

Naga Chaitanya:సాధారణంగా ఒక హీరో సినిమా విడుదల అవుతోంది అంటే ఆయన గత చిత్రాల ఫలితాలను , వాటి కలెక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఆయా చిత్రాలకు బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే నాగచైతన్య చివరిగా తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఇచ్చిన ధైర్యమే ఆయనకు మంచి మార్కెట్ ను అందిస్తోంది అని చెప్పాలి. తాజాగా వృషకర్మ చిత్రంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి కళ్ళు చెదిరే నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం.

భారీ ధరకు అమ్ముడుపోయిన వృషకర్మ నాన్ థియేట్రికల్ హక్కులు..

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ వృషకర్మ సినిమా విడుదల కాకముందే.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఇండస్ట్రీ వర్గాలలో అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి అన్నట్లు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా టాక్ నడుస్తోంది . ప్రముఖ ఓటీటీ, శాటిలైట్ సంస్థ అయిన జీ ఛానెల్ ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ను సుమారుగా రూ.50 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్ట్లు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రూ.50 కోట్ల భారీ డీల్ కుదరడంతో ఈ సినిమా బడ్జెట్లో సగానికి పైగా మొత్తం కేవలం ఈ రైట్స్ ద్వారానే రికవరీ అయిపోయిందనే కామెంట్లు కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం.

మెజారిటీ భాగం వచ్చేసినట్టేనా?

Advertisement

ముఖ్యంగా మ్యూజికల్ రైట్స్ ,హిందీ డబ్బింగ్ శాటిలైట్ హక్కులు కూడా కలిపితే బడ్జెట్లో మెజారిటీ భాగం ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే వెనక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఖండాలు సినిమాతో ఆయన అందుకున్న బ్లాక్ బస్టర్ విజయం కారణంగానే ఆయన తదుపరి చిత్రానికి ఈ రేంజ్ లో బిజినెస్ జరిగిందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇకపోతే విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ దండు.. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మైథాలజికల్ మిస్టరీ థ్రిల్లర్ జానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. డైరెక్టర్ మార్క్ సస్పెన్స్ ఎలిమెంట్స్, మిస్టికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

ALSO READ:‘బేబీ’ సినిమా డబ్బులు ఇంకా రాలేదంటూ బాంబు పేల్చిన ఎస్కేఎన్!

రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన చైతూ టీం..

మరొకవైపు నాగచైతన్య మసూద డైరెక్టర్ సాయికిరణ్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను చైతూ టీం పూర్తిగా ఖండించింది. వీరిద్దరి మధ్య ఎలాంటి కథా చర్చలు జరగలేదని స్పష్టం చేసింది. ఇకపోతే నాగచైతన్య దూత -2 అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు.

Related News

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

మరో రికార్డు కొల్లగొట్టిన ఇరుముడి… దండయాత్ర కొనసాగిస్తున్న రవన్న!

డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొత్త చర్చలు.. సుమలత గద్దె దిగబోతోందా?

మరో క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న రాషా తడానీ.. రిలీజ్ డేట్ లాక్!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!

Big Stories

Advertisement
×