E-Paper
Advertisement

‘బేబీ’ సినిమా డబ్బులు ఇంకా రాలేదంటూ బాంబు పేల్చిన ఎస్కేఎన్!

‘బేబీ’ సినిమా డబ్బులు ఇంకా రాలేదంటూ బాంబు పేల్చిన ఎస్కేఎన్!
Advertisement

SKN: సాయి రాజేష్ దర్శకత్వంలో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కే ఎన్ నిర్మించిన చిత్రం బేబీ. 2023లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా విడుదలయ్యి మూడేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన డబ్బులు తనకి ఇంకా రాలేదు అంటూ ప్రముఖ నిర్మాత ఎస్ కే ఎన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. అసలు విషయంలోకి వెళ్తే తాజాగా ఎస్కేఎన్.. బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం చెన్నై లవ్ స్టోరీ.

‘క ‘ మూవీ లాభాలపై నిర్మాత రియాక్షన్..

తెలుగు రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్గా నటిస్తున్నారు. జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం.. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం బుధవారం రోజు మీడియాతో సమావేశం అయింది .ఈ సందర్భంగా చెన్నై లవ్ స్టోరీ సినిమా హీరో కిరణ్ అబ్బవరంని ఉద్దేశించి..” ‘క ‘ సినిమా మంచి విజయం అందుకున్నప్పటికీ కూడా ఆ సినిమా నిర్మాత చింత గోపాలకృష్ణారెడ్డి మాత్రం తనకు పెద్దగా లాభాలు రాలేదని చెప్పారు. దీనిపై మీ స్పందన ఏమిటి?” అని మీడియా మిత్రులు ప్రశ్నించారు..

నిర్మాత మాటలకు కిరణ్ ఏమన్నారంటే ?

Advertisement

దీనిపై కిరణ్ స్పందిస్తూ.. “మాది ఒక చిన్న సినిమా.. మా చిత్రానికి భారీ స్థాయిలో వసూళ్లు వచ్చి ఉండకపోవచ్చు కానీ సినిమా మాత్రం మంచి విజయం అందుకుంది. అలాగే విడుదలకు ముందే డిస్ట్రిబ్యూటర్లకు సినిమా అమ్మేశాము. ఇక ఆ సినిమా ఏ స్థాయిలో ఆడిందో? ఎంత వసూళ్లు సాధించిందో అనే వివరాలు మీ వద్ద కూడా రికార్డుల రూపంలో ఉంటాయి కదా” అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు కిరణ్.

బేబీ డబ్బులు ఇంకా రాలేదంటూ ఎస్కేఎన్ షాకింగ్ కామెంట్..

ఇదే మీడియా సమావేశంలో నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ..” ఒక సినిమా హిట్ అయినంత మాత్రాన నిర్మాతకు లాభాలు వస్తాయని అనుకోవడం సరైన నిర్ణయం కాదు. నిజానికి నేను నిర్మించిన బేబీ సినిమా మంచి బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్నప్పటికీ.. ఇప్పటికీ కొంతమంది నుంచి రావాల్సిన డబ్బులు నాకు రాలేదు. నిర్మాతలకి కూడా వారి సొంత ఇబ్బందులు ఉంటాయి కదా” అంటూ అసలు విషయాన్ని చెప్పి ఆశ్చర్యపరిచారు. ఇకపోతే ఎస్కేఎన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. సినిమా హిట్ అయినంత మాత్రాన నిర్మాతలకు లాభాలు రావా అనే కోణంలో అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు. ఇకపోతే కిరణ్ అబ్బవరం నటిస్తున్న ఈ చెన్నై లవ్ స్టోరీ సినిమా జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్యూర్ లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ సొంతం చేసుకుంటారో చూడాలి.

Advertisement

also read: టాక్సిక్ స్టోరీ చెప్పేసిన హీరో యశ్..ఈ ట్విస్ట్ ఏంటి గురూ!

Related News

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

మరో రికార్డు కొల్లగొట్టిన ఇరుముడి… దండయాత్ర కొనసాగిస్తున్న రవన్న!

డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొత్త చర్చలు.. సుమలత గద్దె దిగబోతోందా?

మరో క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న రాషా తడానీ.. రిలీజ్ డేట్ లాక్!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!

Big Stories

Advertisement
×