TPCC Guidelines: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పార్టీ శ్రేణులకు కొన్ని కీలకమైన అంశాలను మీనాక్షినటరాజన్ జారీచేసారు. ఇకపై వీటిని తప్పకుండా అందరూ పాటించాలని టీపీసీసీ ఉత్తర్వులను జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు మిరియు ప్రభుత్వ పెద్దలు దీన్ని తప్పకండా పాటించాలని ఏఐసీసీ మీనాక్షినటరాజన్ ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇకపై జరిగే పార్టీ కార్యక్రమాలలో నేటినుండి ఎలాంటి పాలభిషేకాలు, జలాభిషేకాలు చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులకు పెద్ద పెద్ద గజ పూలమాలలు వేయడానికి జేసీబీలు, బుల్డోజర్లు వంటి భారీ యంత్రాల సహయంతో మాలలు వేయకుడదని మీనాక్షినటరాజన్ ఆదేశాలు జారీ చేసారు. ఇకపై పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తల నుండి నాయకుల వరకు ఈ సిద్దాతాలను పాటించాలని ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ టి కుమార్ రావు సంతకంతో కూడిన ఓ అధికారిక లేఖను విడుదల చేశారు.
Also read: బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారుల పేర్కోన్నారు. పాలభిషేకాలు, గజమాలలు వేయండం వంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేఖం అని దీంతో రాష్టానికి నష్ట్రమే తప్ప లాభం లేదని తెలిపారు. పాలను వృదా చేయడం దారణం అని నేటికి సమాజంలో పోషకాహరం అందక చాలా మంది భాదపడుతున్నారని తెలిపారు. కావున దీనికి బదులుగా పోషకాహరాలు పంపిణీ చేసే కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు.
Also read: Ponnam Prabhakar: బోనాల జాతరలో చిందులేసిన మంత్రి పొన్నం.. వీడియో వైరల్!