Vaibhav Sooryavanshi’s father 1000 bouncers: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో (Indian Premier League 2026 tournament) అదరగొట్టిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (vaibhav Sooryavanshi ) అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ తో వరుసగా మూడు టి20లో ఆడాడు వైభవ్. అయితే హైవే లాంటి పిచ్ లు లేకపోవడంతో.. వైభవ్ తొందరగానే అవుట్ అయ్యాడు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో విఫలమై.. విమర్శలకు గురయ్యాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్య వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు ప్రతిరోజు వెయ్యి బౌన్సర్లతో ప్రాక్టీస్ చేస్తున్నాడని… ఆ బంతులు కూడా తానే వేస్తున్నట్లు హాట్ కామెంట్స్ చేశారు. ఈ దెబ్బకు ఒక్కొక్కడి ప్యాంట్ తడిచిపోవాల్సిందే అంటూ హెచ్చరించారు. దీంతో వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ (father of vaibhav Sooryavanshi ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో సెంచరీలతో పాటు అర్థ సెంచరీలు చేసి రెచ్చిపోయిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ… అంతర్జాతీయ క్రికెటర్ లో మాత్రం విఫలమయ్యాడు. ఆడిన 3 మ్యాచ్ లలో 50 పరుగులు కూడా సాధించలేకపోయాడు. ఇంగ్లాండ్ మైదానాలలో బౌలర్లను ఎదుర్కొనేందుకు వణికిపోయాడు. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో ఆడ లేక… ప్యాకప్ అయ్యాడు. అతడు పక్క ప్లానింగ్ తో బౌన్సర్లు వేస్తే.. సులభంగా క్యాచ్ లు ఇచ్చి వెనుదిరిగాడు వైభవ్. దీంతో వైభవ్ సూర్యవంశీ బలహీనతలు బయటపడ్డాయి. షార్ట్ పిచ్, వరుస బౌన్సర్లు వేస్తే వైభవ్ సూర్య వంశీ తొందరగానే అవుట్ కావడం గ్యారంటీ అని అందరికీ తెలిసిపోయింది.
బౌన్సర్లకు భయపడుతున్న వైభవ్ సూర్యవంశీని.. బలమైన క్రికెటర్ గా తయారు చేసేందుకు తన తండ్రి సంజీవ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తమ ఇంటి దగ్గర ఉన్న గ్రౌండ్ దగ్గరే రోజుకు 1000 బౌన్సర్లతో ప్రాక్టీస్ చేయిస్తున్నాడు సంజీవ్. ఇందులో సంజీవ్ కూడా కొన్ని బౌన్సర్లు వేస్తున్నారట. మరికొన్ని బౌన్సర్లను ఇతర ప్లేయర్లతో వేయించి… వైభవ్ ను మరింత బలమైన బ్యాటర్ గా తయారు చేస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా వైభవ్ తండ్రి సంజీవ్ పేర్కొన్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఒక్కరోజులో 1000 బౌన్సర్లు అసలు సాధ్యం కాదని.. 100 బౌన్సర్లు ఆడడం ఎక్కువ అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. అనవసరంగా వైభవ్ గురించి హైప్ పెంచకూడదని పేర్కొంటున్నారు.
🚨 VAIBHAV SOORYAVANSHI IS NOT YET COMPARABLE TO DON BRADMAN OR SACHIN TENDULKAR 🚨
Recently, during an NDTV interview, Vaibhav Sooryavanshi’s father was asked about comparisons being made between Vaibhav and legends such as Don Bradman and Sachin Tendulkar following his… pic.twitter.com/x4dTNRIvOF
— Harshit (@I_am_Harshit_17) June 7, 2026