Sivakarthikeyan : కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే ఈయన స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. విభిన్న కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న శివ కార్తికేయన్ ఈ ఏడాది పరాశక్తి మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం భారీ ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ హీరో సీఎం విజయ్ దళపతిని కలిసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఎందుకు ఈయన సీఎం ని కలిశారు? రాజకీయాల్లోకి ఏమైనా ఎంట్రీ ఇస్తున్నాడా అన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.. ప్రస్తుతం శివ కార్తికేయన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. అందులో ఏముందో ఒకసారి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం…
తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ దళపతిని సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు కలిసి ఇండస్ట్రీ గురించి ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు. ప్రస్తుతం సినిమాల పరిస్థితి ఎలా ఉంది అన్న విషయాల గురించి ఇప్పటికే సినీ పెద్దలు చర్చించారు. అంతే కాదు స్టార్ హీరోలు కూడా సీఎం విజయ్ ని కలిస్తే అతనితో ఉన్న సంబంధాన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ సీఎం విజయ్ దళపతినే కలిశారు. ఈ మేరకు హీరో శివ కార్తికేయన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక ట్వీట్ చేశారు.. అందులో.. ప్రజల హృదయాలను అలరించడం నుండి రాష్ట్రాన్ని నడిపించే స్థాయికి ఎదగడం వరకు.. కొన్ని ప్రయాణాలు నిజంగా అసాధారణమైనవి.. తమిళనాడు గౌరవనీయులైన సీఎం సి. జోసెఫ్ విజయ్ గారిని కలవడం ఇవాళ నాకు దక్కిన గౌరవం. ‘రసిగన్ ఎక్స్‌ప్రెస్’ నుంచి ‘విజయ్ అవార్డ్స్’, అలాగే ‘గోట్’ చిత్రంలో కలిసి నటించడం నుంచి ఇప్పటివరకు మీతో గడిపిన ప్రతిదీ అత్యంత ప్రత్యేకంగా నిలిచిపోతుంది. మా మధ్య ఉన్న సోదరభావం, ఆ అనుబంధం ఇలాగే కొనసాగుతాయి. అంటూ రాసుకొచ్చాడు.. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..
తమిళనాడు సీఎం విజయ్ దళపతి చివరి చిత్రం జననాయన్.. ఈ మూవీ కోసం విజయ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే జనవరిలో విడుదల కావాల్సిన సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జాప్యం వల్ల ఇప్పటికీ విడుదల కాలేదు. రీసెంట్గా ఈ చిత్రం రిలీజ్ డేట్ ని ప్రకటించిన విషయం తెలిసిందే. 2026 జూలై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.. హెచ్. వినోత్ దర్శకత్వంలో, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘జన నాయగన్’, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అనుభూతిని అందిస్తుంది అంటూ చిత్ర యూనిట్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. మరి సినిమా టాక్ ఎలా ఉంటుందో అన్నది చూడాలి..
Also Read :‘ఇంటింటి రామాయణం ‘ కమల్ ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేశాడంటే..?
From entertaining hearts to leading the state… some journeys are truly EXTRAORDINARY.
It was an honour to greet our Honourable Chief Minister of Tamil Nadu, Thiru C. Joseph Vijay sir.
From Rasigan Express, to the Vijay Awards stage, to sharing the screen in GOAT… and now,… pic.twitter.com/HnKuYimuPT
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) July 15, 2026