E-Paper
Advertisement

‘అయ్యగారి’ని కలిసిన ఆ వీరాభిమాని.. కన్నీళ్లు తుడిచి.. హత్తుకున్న అఖిల్

‘అయ్యగారి’ని కలిసిన ఆ వీరాభిమాని.. కన్నీళ్లు తుడిచి.. హత్తుకున్న అఖిల్
Advertisement

Akhil:అఖిల్ అక్కినేనికి నిజమైన అభిమానిగా నిరూపించుకుంటూ అఖిల్ సక్సెస్ లో భాగమవుతున్న అభిమాని నాగరాజు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా మూడేళ్ల క్రితం ఏజెంట్ సినిమా సమయంలో అయ్యగారే నెంబర్ వన్ అంటూ హల్చల్ చేసిన నాగరాజు మళ్లీ పత్తా లేకుండా పోయాడు. అయితే మూడేళ్ల తర్వాత అఖిల్ మళ్లీ తన కొత్త సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా మళ్లీ వచ్చి అయ్యగారే నెంబర్ వన్ అనే డైలాగ్ తో మళ్ళీ రెచ్చిపోయారు. పైగా అఖిల్ కటౌట్ కి పెద్ద పెద్ద పూలదండలు వేసి, గుమ్మడికాయలతో దిష్టి తీసి మరీ ఈసారి సక్సెస్ గ్యారెంటీ అనే రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు. ఇక అన్నట్టుగానే అఖిల్ వినూత్న కథతో అద్భుతమైన నటనా నైపుణ్యంతో అందరి దృష్టిని ఆకట్టుకొని, మంచి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

అభిమానిని కలిసిన అఖిల్..

పైగా అఖిల్ లెనిన్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా తన అభిమాని సందడి చేస్తున్న వీడియోలను తన మొబైల్లో చూస్తూ మురిసిపోయిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. ఇక ఎట్టకేలకు అఖిల్ తన అభిమానిని కలుసుకున్నాడు. అఖిల్ నిన్న తన వద్దకు వచ్చిన నాగరాజును ప్రత్యేకంగా ఆహ్వానించారు. తన అభిమాన హీరోను ప్రత్యక్షంగా చూడగానే ఆనందంతో ఉప్పొంగిపోయిన నాగరాజు వెంటనే అఖిల్ కాళ్లపై పడిపోయాడు. అఖిల్ వద్దని వారించి.. ఆ తర్వాత ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు. ఇక అనుకోకుండా తన జీవితంలో జరిగిన ఈ అనూహ్య పరిణామంతో కన్నీళ్లు పెట్టుకున్న నాగరాజు.. ఈ జన్మకు ఇది చాలన్నా అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

కన్నీళ్ల నడుమ కమ్మని ఆప్యాయత..

Advertisement

ఇకపోతే నాగరాజును హత్తుకున్న అఖిల్ మాట్లాడుతూ సంతోషమేనా..ఇక ఈసారి అంతకుమించి హిట్ కొడదాం అంటూ హామీ ఇచ్చాడు. అలాగే తన భార్య జైనాబ్ ను కూడా నాగరాజుకి పరిచయం చేశారు అఖిల్. పైగా ఈ ఎమోషనల్ మీటింగ్ కి సంబంధించిన వీడియోని అన్నపూర్ణ స్టూడియోస్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకోగా.. ఈ వీడియో కాస్తా క్షణాల్లో వైరల్ అయింది. ఏది ఏమైనా స్టార్ డం ఉన్నప్పటికీ కూడా అభిమానికి ఇంతటి గౌరవం ఇవ్వడంపై అటు సినీ ప్రముఖులు, నెటిజన్లు అఖిల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సంఘటనతో అఖిల్ తన అభిమానుల మనసులో మరింత ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

also read:ఫౌజీ రిలీజ్ డేట్ వచ్చేందిచోచ్!

అనూహ్య పరిణామంతో ఉప్పొంగిపోతున్న అభిమాని..

Advertisement

నాగరాజు విషయానికి వస్తే.. గుంటూరులో రోడ్డు పక్కన పండ్ల వ్యాపారం చేసుకుని జీవించే నాగరాజు కి కనీసం ఒక ఫోన్ కూడా లేదట. అయితే ప్రతిరోజు తన ఊర్లో అఖిల్ తనను కలుస్తాడని, చుట్టుపక్కల వాళ్లతో చెప్పుకొని మురిసిపోయేవాడట. అయితే అలాంటి అనూహ్య పరిణామం సడన్గా తన జీవితంలో చోటు చేసుకునేసరికి నాగరాజు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ఇంతకంటే భాగ్యం మరొకటి లేదు అంటూ నాగరాజు చేసిన కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

Related News

ఫౌజీ రిలీజ్ డేట్ వచ్చేందిచోచ్!

సీఏం విజయ్ ను కలిసిన శివకార్తికేయన్.. స్పెషల్ ట్వీట్ వైరల్..

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

ఒకే రోజు 2 చిత్రాలతో రాబోతున్న స్టార్ హీరోయిన్.. కనీసం ఒక్కటైనా హిట్ అవుతుందా?

బన్నీ కొత్త ప్రాజెక్ట్.. తెలుగు డైరెక్టర్స్ ని పక్కన పెట్టేసినట్టేనా?

రాజమౌళి నెక్స్ట్ హీరో? ఎవరూ ఊహించని కాంబో!

కాంతార, డ్రాగన్, ధర్మన్.. రుక్మిణి వసంత్ ఖాతాలో అన్నీ క్రేజీ ప్రాజెక్టులే…… కానీ!

Big Stories

Advertisement
×