Nagarjuna Thanks to Allu Arjun: రామ్ గోపాల్ వర్మ, నాగార్జున అక్కినేని కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘శివ‘ మళ్లీ థియేటర్లోకి వస్తుంది. శివ సినిమా వచ్చిన 36 ఏళ్లు అవుతుంది. మరోవైపు అన్నపూర్ణ స్టూడియో కూడా 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శివ చిత్రాన్ని మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. నవంబర్ 14 ఈ చిత్రం రీ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా శివ మూవీ గురించిన ముచ్చట్లు, అప్పట్లో ఈ కల్ట్ క్లాసిక్ మూవీ సృష్టించిన సంచలనం గురించి పలువురు సినీ సెలబ్రేటీలు షేర్ చేస్తూ మూవీని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పిటికే శేఖర్ కమ్ముల, అశుతోష్ గోవారికర్లు శివ తమ జీవితాలను ఎలా ప్రభావం చేసిందో చెబుతూ ఈ సినిమాను ప్రేక్షకులకు అందించిన రామ్ గోపాల్ వర్మకు థ్యాంక్స్ చెప్పారు.
అలాగే తాజాగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కూడా శివ మూవీ గురించి విశేషాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. “నమస్తే.. మన శివ సినిమా విడుదలై 36 ఏళ్లు అవుతుంది. ఇండియన్, తెలుగు ఇండస్ట్రీ చరిత్రలోనే శివ ఒక ఐకానిక్ కల్ట్ క్లాసికల్‌గా నిలిచిందనడంలో సందేహం లేదు. ఈ ఒక్క చిత్రం తర్వాత మొత్తం ఇండియన్, తెలుగు సినీ ఇండస్ట్రీ రూపురేఖలే మారిపోయాయి. అలాంటి ఈ సినిమా ఇప్పుడు మళ్లీ థియేటర్లలోకి వస్తుందంటే తెలుగు ఇండస్ట్రీ. 4kలో సరికొత్త టెక్కాలజీ ఈ చిత్రం మళ్లీ అలరించేందుకు రెడీ అవుతుంది. కాబట్టి సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. కాబట్టి అక్కినేని అభిమానులు, మూవీ లవర్స్ అంత శివ సెలబ్రేషన్స్కి సిద్దం అవ్వండి. థియేటర్లకు రెండు లారీల పేపర్లు తీసుకువెళ్లండి” అంటూ బన్నీ శివ గురించి చెప్పుకొచ్చాడు.
Dear @alluarjun rendu lorryla thanks to you !!!💥💥💥#Shiva4KOnNovember14th #50YearsOfAnnapurna #SHIVA #ANRLivesOn@RGVzoomin @amalaakkineni1 @ilaiyaraaja @AnnapurnaStdios #SGopalReddy @adityamusic pic.twitter.com/5FSZAyqpp5
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 25, 2025
అల్లు అర్జున్ వీడియో కింగ్ నాగార్జున షేర్ చేశారు. ‘డియర్ అల్లు అర్జున్.. నీకు రెండు లారీల థ్యాంక్స్’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా శివ సినిమా అప్పట్లో ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అప్పటి ప్రేమకథలు చేసుకుంటున్న నాగ్లోనూ మాస్ మ్యానరిజం ఉందని చూపించిన చిత్రమిది. ఈ చిత్రంతో నాగార్జున ఇమేజ్ అమాంతం పెరిగింది. దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మను కూడా మరో మెట్టులో నిలబెట్టింది శివ. అప్పటి యూత్ అంత శివ పాత్రలనే ఫాలో అవ్వడం, అచ్చం నాగార్జున స్టైల్లో డ్రెస్సింగ్ వేసుకుని హీరోయిజం చూపించవారంటే శివ యూత్ని ఎంతగా ఆకట్టుందో చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదోక ఫేస్ వారిలో శివ ఉంటాడని వర్మ ఈ చిత్రంతో చూపించాడు. అంతగా ఆకట్టుకున్న ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా సైకిల్ చైన్ సన్నివేశం ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. అంతగా ఆకట్టుకున్న ఈ చిత్రం మళ్లీ థియేటర్లలోకి వస్తుందంటే 90’s ఫ్యాన్స్కి పండగే. మరి రీ రిలీజ్ శివ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.