Womens World Cup 2025: వన్డే మహిళల వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ఇండియా వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ ను ఇండియాతో పాటు శ్రీలంక కూడా నిర్వహిస్తున్నాయి. అంటే కొన్ని మ్యాచ్ లు ఇండియాలో అలాగే మరికొన్ని శ్రీలంకలో జరుగుతాయి. ఇలాంటి నేపథ్యంలో భారతదేశానికి ఘోర అవమానం జరిగింది. ఇండియాలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా మహిళల జట్టును లైంగికంగా ఓ దుర్మార్గుడు వేధించాడట. ఈ సంఘటన ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ లో భాగంగా ప్రస్తుతం ఇండియాలోనే ఉంది మహిళల ఆస్ట్రేలియా జట్టు. ఇప్పటికే ఫైనల్ కు దూసుకు వెళ్లిన ఆస్ట్రేలియా ఇవాళ దక్షిణాఫ్రికా తో గ్రూప్ స్టేజ్‌లో మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ వేదికగా జరుగుతోంది. ఇందులో భాగంగానే మూడు రోజుల కిందట అంటే అక్టోబర్ 23వ తేదీన ఇండోర్ కు ఆస్ట్రేలియా మహిళల జట్టు వచ్చింది. ఇండోర్ లోని ఓ ప్రముఖ హోటల్ లో మహిళల ఆస్ట్రేలియా జట్టుకు అతిథ్యం ఏర్పాటు చేసింది భారత్ క్రికెట్ నియంత్రణ మండలి. అక్టోబర్ 23వ తేదీన ఆస్ట్రేలియా మహిళల జట్టుకు సంబంధించిన ఇద్దరు క్రికెటర్లు షాపింగ్ లో భాగంగా బయటకు వెళ్లారట.
రోడ్డుపై నడుస్తున్న నేపథ్యంలో బైక్ పైన వచ్చిన ఓ దుర్మార్గుడు, ఆ ఇద్దరు క్రికెటర్లను లైంగికంగా వేధించాడట. వాళ్ల జుట్టును కూడా పట్టి లాగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన సరిగ్గా ఇండోర్ లోని కజ్రానా రోడ్ సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన జరిగిన వెంటనే ఆస్ట్రేలియా టీం యాజమాన్యానికి ఫిర్యాదు చేశారట ఆ ఇద్దరు క్రికెటర్లు. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న బీసీసీఐ కూడా… పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ నిందితుడిని అక్టోబర్ 24వ తేదీ అంటే నిన్న అరెస్టు చేశారు. అతని బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా నిందితున్ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆ నిందితుడు ముస్లిం అని, అతని పేరు ఖాన్ అని సమాచారం. గతంలో కూడా ఖాన్ పై నేర చరిత్ర ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సంఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.
విదేశీ మహిళలకు ఇండియాలో భద్రత లేదని.. ఈ నేపథ్యంలో ఇండియాలో ఎలాంటి ఐసీసీ ఈవెంట్లు నిర్వహించకూడదని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ కు చెందిన కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలు.. ఇండియాను బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ICC needs to ban India from hosting events in future because International players are not safe in India. ICC needs to take strict action otherwise these things will keep happening. pic.twitter.com/xL9N0uG8ez
— Ehtisham Siddique (@iMShami_) October 25, 2025