Rashmika: రష్మిక(Rashmika) ప్రధాన పాత్రలో నటుడు రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend). ఈ సినిమా నవంబర్ 7వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేశారు. ఈ పాటలకు ఎంతో మంచి ఆదరణ లభించింది. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయడంతో ట్రైలర్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశారు. ఇక రష్మిక కూడా ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తాను ఒక సినిమాకు కమిట్ అయ్యాను అంటే నా సినిమా చూసిన ప్రేక్షకులు కానీ, అభిమానులు కానీ చాలా సంతృప్తిగా బయటకు రావాలి అదే నా లక్ష్యం అంటూ తన సినిమాల గురించి తెలియజేశారు. ఇలా రష్మిక మాట్లాడుతున్న సమయంలోనే యాంకర్ రష్మికను ప్రశ్నిస్తూ.. హూ ఇస్ రష్మిక టైప్ అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు రష్మిక సమాధానం చెప్పేలోపే అభిమానులు ఒక్కసారిగా రౌడీ అంటూ గట్టిగా కేకలు వేశారు.
ఇలా అభిమానులు రౌడీ అంటూ విజయ్ దేవరకొండ ఉద్దేశించి మాట్లాడటంతో రష్మిక మాత్రం తెగ సిగ్గు పడిపోతూ..అందరికీ తెలుసు అంతే అంటూ రౌడీ హీరోతో వ్యవహారం గురించి అధికారకంగా చెప్పకనే చెప్పేశారు. అయితే రష్మిక విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ అక్టోబర్ 4వ తేదీ అది కొద్దిమంది సమక్షంలో నిశ్చితార్థపు వేడుకలను జరుపుకున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఇక ఈ విషయం గురించి రష్మిక విజయ్ దేవరకొండ అధికారకంగా వెల్లడించకపోయిన ఆయన టీం మాత్రం క్లారిటీ ఇచ్చారు.. రష్మిక విజయ్ దేవరకొండ నిశ్చితార్థం(ఎంగేజ్మెంట్) జరిగిన మాటే నిజమేనని తెలిపారు అయితే 2026 ఫిబ్రవరిలో వీరి పెళ్లి ఉంటుందని తెలిపారు.
ప్రీ రిలీజ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ..
రష్మిక విజయ్ దేవరకొండ నిశ్చితార్థం చేసుకున్నారనే విషయం తెలియడంతో ఈ విషయాన్ని స్వయంగా రష్మిక నుంచి చెప్పించాలనే ప్రయత్నాలు చేస్తున్న ఆమె మాత్రం ఎక్కడ స్పందించలేదు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత అల్లు అరవింద్ కూడా మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు విజయ్ దేవరకొండను చీఫ్ గెస్ట్ గా పిలుద్దామని చెప్పడంతో ఒకసారిగా ఆడిటోరియం అరుపులతో మారుమోగిపోయింది. ఇలా అల్లు అరవింద్ మాటలను బట్టి చూస్తుంటే ఈయన ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండను ముఖ్యఅతిథిగా తీసుకురాబోతున్నారని స్పష్టమవుతుంది. ఇక ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మికకు జోడిగా దీక్షిత్ శెట్టి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు.