Chaderghat Firing: హైదరాబాద్ చాదర్ ఘాట్ లో కాల్పుల కలకలం రేగింది. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై దొంగలు కత్తితో దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో డీసీపీ, గన్ మ్యాన్ వారిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య సీపీ కార్యాలయంలో ఓ మీటింగ్‌కు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ఫోన్ చోరీ చేసి పారిపోతున్న ఇద్దరు దొంగలను గుర్తించారు. దొంగలను పట్టుకునే డీసీపీ చైతన్య, ఆయన గన్‌మెన్ ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ దొంగ డీసీపీపై కత్తితో దాడి చేయడానికి యత్నించాడు. ఈ ఘటనలో డీసీపీ చైతన్య కింద పడిపోయారు. వెంటనే తేరుకుని పారిపోతున్న దొంగలపై కాల్పులు జరిపారు. డీసీపీ కాల్పుల్లో ఒకరికి గాయాలయ్యాయి. గాయపడిన నిందితుడిని నాంపల్లి ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్‌లో ఉత్కంఠభరిత సంఘటన చోటుచేసుకుంది. సెల్‌ఫోన్ స్నాచింగ్ చేస్తున్న దొంగను పట్టుకునే యత్నం చేసిన డీసీపీ చైతన్యపై దొంగ కత్తితో దాడి చేయడానికి యత్నించాడు ఘటన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విక్టరి ప్లే గ్రౌండ్లో చోటుచేసుకుంది. స్వయంగా దొంగను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసిన డీసీపీ చైతన్యపై ఆకస్మికంగా దొంగ దాడికి దిగాడు. ఈ క్రమంలో డీసీపీ చైతన్య గన్‌మెన్ కిందపడ్డాడు. వెంటనే డీసీపీ చైతన్య గన్‌మన్ వెపన్ తీసుకుని స్వయంగా దొంగపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.
డీసీపీ చైతన్య ధైర్యసాహసంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగ పరిస్థితి, దర్యాప్తు వివరాలు వెలువడాల్సి ఉంది.
Also Read: Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. పోలీసుల అదుపులో బైకర్ ఫ్రెండ్, షాకింగ్ విషయాలు వెల్లడి