K-Ramp:కిరణ్ అబ్బవరం (Kiran abbavaram) నటించిన తాజా మూవీ కే- ర్యాంప్. దివాళీ కానుకగా అక్టోబర్ 18న విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ క్రియేట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ మూవీ మొదటి రెండు రోజులు ఏదో సోసో గా ఉంది మూవీ అనే లాగే టాక్ వినిపించింది. కానీ తినగా తినగా వేము తియ్యగా ఉండును అన్నట్లు సినిమా చూడగా చూడగా ప్రేక్షకులకి బాగా ఎక్కేసింది. చివరికి బ్లాక్ బస్టర్ టాక్ అని ప్రేక్షకులు రివ్యూ ఇచ్చారు. దాంతో సినిమా చూడడానికి చాలామంది థియేటర్లకు పరుగులు తీశారు. అలా ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. అలా కిరణ్ అబ్బవరం హీరోగా.. యుక్తి తరేజా హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీకి జైన్స్ నాని డైరెక్షన్ చేశారు.అయితే తాజాగా ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే.. కే – ర్యాంప్ ఇప్పటికే అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లో దూసుకుపోతోంది..అయితే దీపావళి బరిలో నిలిచిన డ్యూడ్,తెలుసు కదా, కే-ర్యాంప్ ఈ సినిమాలు అన్నింటికి పాజిటివ్ టాకే వచ్చింది. అయితే వీటిలో కే-ర్యాంప్ మూవీకి మౌత్ టాక్ బలంగా ఉంది. అందుకే ఈ మూడింటిలో ఈ సినిమా చూడడానికే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమాకి రూ.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం 7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. కానీ ఐదు రోజుల్లోనే 7.7 కోట్ల షేర్ ను కాబట్టి అటు గ్రాస్ పరంగా 14 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఇటు నిర్మాతలకు కూడా మంచి లాభాలను మిగిల్చింది.
అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ అవ్వడంతో పాటు లాభాల్లో దూసుకుపోతోంది. అంతేకాకుండా ప్రస్తుతం మరో కొత్త సినిమా కూడా రిలీజ్ కి రెడీగా లేకపోవడంతో రెండో వారం కూడా కలెక్షన్స్ భారీగానే వచ్చాయి.. ఇక ఈనెల లాస్ట్ లో మాస్ జాతర మూవీ విడుదల కాబోతుంది. అప్పటివరకు కే ర్యాంప్ మూవీకి కలెక్షన్స్ కి తిరిగే ఉండదని చెప్పుకోవచ్చు.. అయితే కే ర్యాంప్ మూవీ హిట్ టాక్ తో మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.
ALSO READ:Mass jathara: సెన్సార్ పూర్తి చేసుకున్న మాస్ జాతర.. రన్ టైం లాక్!
అదేంటంటే.. కిరణ్ అబ్బవరంకి K అనే లెటర్ తో పాటు దివాళీ పండగ కూడా బాగా కలిసి వచ్చినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే గత ఏడాది కిరణ్ అబ్బవరం నటించిన క మూవీ దీపావళి కానుకగా విడుదలై బాక్సాఫీస్ ని షేక్ చేసింది.అలా ఈ ఏడాది విడుదలైన కే ర్యాంప్ మూవీ కూడా దివాళి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. చూస్తుంటే కిరణ్ అబ్బవరంకి K అనే లెటర్ తో పాటు దీపావళి పండగ కూడా బాగా కలిసొచ్చినట్టు అర్థమవుతుంది.. మరి చూడాలి బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందో.